వరుడిని, తండ్రిని కిడ్నాప్ చేసిన వధువు ఫ్యామిలీ

అమ్మాయిని అప్పచెబితేనే తండ్రిని విడిచి పెడతామని వారు స్పష్టం చేశారు. దీంతో యువజంట విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లిలో తల్లీకుతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మృగాడు తల్లీకూతుళ్ల మెడను అత్యంత కిరాతకంగా నరికేసి హత్య చేశాడు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఘటనా స్థలం వద్ద అరటిగెలలు నరికే కత్తి లభించింది. శివయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు శివయ్య పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications