తణుకుకు మహర్దశ:లో ఓల్టేజ్ సమస్యకు కొత్త సబ్‌స్టేషన్లతో పరిష్కారం- మంత్రి గొట్టిపాటి
తణుకు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గురువారం పర్యటించిన మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు కలిసి రూ. 23 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాలను ప్రారంభించారు. వేల్పూరులో 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసిందని ఆరోపించారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో టీడీఆర్ బాండ్లలో అవినీతికి పాల్పడి వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు.మున్సిపల్ వ్యవస్థను ప్రక్షాళన చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

తణుకు పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రెండు సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 861 కోట్లతో గుంతలు పూడ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications