బాబు నోట కేసు-ఓటుకు నోటు: 'మోడీ-కేసీఆర్ గేమ్' 'ఆ గొంతు బాబుదేనని తేల్చిన ఫోరెన్సిక్'
హైదరాబాద్/అమరావతి: మూడేళ్ల తర్వాత ఓటుకు నోటు కేసు అంశం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. నాడు ఓటుకు నోటుకు ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అప్పుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు పోరాటంగా కనిపించింది. ఇప్పుడు చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు రావడంతో మోడీ సూచన మేరకు కేసీఆర్ ఈ అస్త్రాన్ని బయటకు తీశారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 'ఇలా మాట్లాడుతున్నారేంటి... పవన్ వ్యాఖ్యలతో జనసేన సభకు వెళ్లిన వాళ్లూ విస్మయం'
అయితే, ఇందులో రాజకీయ కోణం లేదని, అన్నికేసులపై సమీక్ష చేసినట్లుగానే ఓటుకు నోటులోను చేశారని టీఆర్ఎస్ చెబుతోంది. ఎన్నికలకు ముందు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని చంద్రబాబు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తెరపైకి రావడం చర్చకు దారి తీసింది. సుప్రీం కోర్టు హియరింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసు సమీక్ష చేస్తే అందుకు విపక్షాల ఆరోపణలు సరికాదంటున్నారు.
చదవండి: ఓటుకు నోటులో ఏంలేదని కోర్టే చెప్పింది, ఏం చేస్తారో చూద్దాం, బాబుపై జగన్ కుట్ర: టీడీపీ షాకింగ్
చదవండి: బీజేపీకి అప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా? నేను అలా చెప్పలేదు: అశోక్ బాబు కౌంటర్

ఈ కేసుతో ఏపీ ప్రజల సానుభూతి పొందాలనే, కేసు బూచీగా చూపి
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని, వీడియోలు, ఆడియోలతో దొరికిపోయారని, కానీ కేసీఆర్ అన్ని కేసులపై సమీక్ష జరుపుతుంటే ఓటుకు నోటు కేసుతో ఏపీ ప్రజల సానుభూతి పొందేందుకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మరోవైపు, ఈ కేసును బూచీగా చూపి టీడీపీని బెదిరించాలని చూస్తున్నారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు అన్నారు.

అది చంద్రబాబు గొంతే, సీఎం పదవి నుంచి తప్పుకోవాలి
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని, కాబట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు గౌరవంగా తప్పుకోవడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య హితవు పలికారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి సూచించారు. ఈ కేసులో చంద్రబాబు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు.

చంద్రబాబు అడ్డంగా దొరికారు
ఓటుకు నోటు కేసులో ఇప్పటికైనా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కేవలం ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చేతులు దులుపేసుకున్నారన్నారు. ఈ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే ఏపీ ప్రజల హక్కులను పణంగా పెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లాలూచీపడి ఏపీ నీటి హక్కులు రాసిచ్చారని బాబుపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు విచారణను నిష్పక్షపాతంగా చేయాలని డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసు అలాంటిదే
కేసీఆర్ తన ఇష్టానుసారం పాత కేసులను తిరగదోడుతున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసు కూడా అలాంటిదే అన్నారు. నయీం కేసుకు ఎంతో ప్రచారం కల్పించి చివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా చేశారన్నారు. కేసులను ప్రభుత్వమే నీరుగారుస్తోందన్నారు.

బీజేపీ చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఆ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. హైకోర్టు కూడా ఓటుకు నోటు కేసులో అవినీతి లేదని చెప్పిందని వారు అంటున్నారు. బీజేపీ చెప్పుచేతల్లోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందన్నారు. వైసీపీ - కేంద్రం కలిసి తెలంగాణలోని పరిణామాలను (ఓటుకు నోటు కేసు) చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications