'ఇలా మాట్లాడుతున్నారేంటి... పవన్ వ్యాఖ్యలతో జనసేన సభకు వెళ్లిన వాళ్లూ విస్మయం'

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట ఏ నాయకుడు వెళ్లరని, ఆయనను ఎవరూ నమ్మడం లేదని హోంమంత్రి చినరాజప్ప ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దని ప్రధాని మోడీ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశారన్నారు.

చదవండి: 'గ్రాఫ్ పడిపోతుందని ఆలోచనలోపడ్డ పవన్ కళ్యాణ్, చంద్రబాబు సర్వే'

బీజేపీతో వెళ్తే మునిగిపోతానని పవన్ ప్రస్తుతం భయపడుతున్నారని చెప్పారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కోరిక పట్టుకుందన్నారు. కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదన్నారు. జగన్, పవన్ కళ్యాణ్‌లను ఆడిస్తోంది బీజేపీయే అన్నారు. కాపులు తమ వెంటే ఉన్నారని చెప్పారు.

పవన్‌కు స్థిరత్వం లేదు, మళ్లీ కలిస్తే కలవొచ్చు కానీ

పవన్‌కు స్థిరత్వం లేదు, మళ్లీ కలిస్తే కలవొచ్చు కానీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హఠాత్తుగా టీడీపీకి ఎందుకు ఎదురు తిరిగారో అర్థం కావడం లేదని చినరాజప్ప అన్నారు. ఆయన విమర్శల వెనుక ఏదో శక్తి ఉందన్నారు. ఆయన వెనుక బీజేపీ వాళ్లు ఉన్నారని తాము భావిస్తున్నామని చెప్పారు. పవన్‌కు స్థిరత్వం లేదని, వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే మళ్లీ కలిస్తే కలవొచ్చని చెప్పారు. మేం దానిని ఆశించడం లేదని చెప్పారు.

అందుకే వారు యూటర్న్

అందుకే వారు యూటర్న్

బీజేపీకి చెందిన కొందరు నేతలు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగిందని, కానీ ఆ పార్టీ పెద్దలు జగన్‌ను హెచ్చరించడంతో బీజేపీ నేతలను చేర్చుకోవడం లేదని చినరాజప్ప అన్నారు. జగన్ బీజేపీ కంట్రోల్లో ఉన్నారని చెప్పారు. విజయి సాయి రెడ్డి నిత్యం పీఎంవో కార్యాలయంలో కనిపించడానిని బట్టే ఆ రెండు పార్టీల మధ్య సంబంధం అర్థమవుతోందన్నారు.

అందుకే వారు యూటర్న్

అందుకే వారు యూటర్న్

బీజేపీకి చెందిన కొందరు నేతలు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగిందని, కానీ ఆ పార్టీ పెద్దలు జగన్‌ను హెచ్చరించడంతో బీజేపీ నేతలను చేర్చుకోవడం లేదని చినరాజప్ప అన్నారు. జగన్ బీజేపీ కంట్రోల్లో ఉన్నారని చెప్పారు. విజయి సాయి రెడ్డి నిత్యం పీఎంవో కార్యాలయంలో కనిపించడానిని బట్టే ఆ రెండు పార్టీల మధ్య సంబంధం అర్థమవుతోందన్నారు.

జగన్ అలా చేస్తే సీఎం అయ్యే అర్హత

జగన్ అలా చేస్తే సీఎం అయ్యే అర్హత

లోకేష్ తన పోర్టుపోలియోలో జోక్యం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలను చినరాజప్ప కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లోను మా జిల్లాలో టీడీపీ అన్ని సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని, అప్పుడే ఆయనకు సీఎం అయ్యే అర్హత ఉంటుందని, కానీ నిత్యం చంద్రబాబు దిగిపో అని చెప్పడ సరికాదని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+