రాజధానిపై బ్రిటిష్ కంపెనీల దృష్టి, హోదా కాలమే!, ఉద్యోగ నేతలపై దేవినేని సంచలనం

విజయవాడ/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో బ్రిటిష్ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. సిఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం అధికారులతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆండ్రూ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. ఆదర్శవంతమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఏఅపీ రాజధాని నిర్మాణంలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా ప్రయత్నిస్తామన్నారు.

ప్రత్యేక హోదా: కాలం నిర్ణయిస్తుందా?

British Companies in Amaravati

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా, రాదా, మభ్యపెట్టడమా అన్నది కాలం నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చెప్పడం గమనార్హం. ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, దానిని దృష్టిలో పెట్టుకొని సమతుల్యంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.

విదేశాలు తిరుగుతున్న సిఎం: నెహ్రూ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాలు తిరుగుతున్నారని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పైనా వారు మండిపడ్డారు.

ఎమ్మెల్సీ పదవుల కోసం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఉద్యోగులు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు బ్రోకర్లుగా మారారన్నారు. తాగు నీరు లేక రైతులు అవస్థ పడుతుంటే బాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+