పవన్ కళ్యాణ్ తో బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ భేటీ; వచ్చే ఎన్నికలపై చర్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ చేసి జైలుకు పంపిన తరువాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసిన పవన్ కళ్యాణ్ అక్కడే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని పొత్తుతో ఎన్నికలకు వెళ్తామని ప్రకటన చేశారు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పవన్ కళ్యాణ్ తో వచ్చే ఎన్నికలపై చర్చించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.

పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ఆయన కొంత సమయం పాటు ఆయనతో చర్చించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సందర్భంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘు రామన్ కూడా ఉన్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారితో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ.. pic.twitter.com/RRHZoVkuoJ
— JanaSena Party (@JanaSenaParty) September 15, 2023
ఈ సమావేశంపై జనసేన పార్టీ సోషల్ మీడియాలో స్పందించింది. పవన్ కళ్యాణ్ గారితో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీలో వర్తమాన, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అంశాలపై చర్చ జరిగిందని జనసేన తన ప్రకటనలో పేర్కొంది. ఇక మరోవైపు ఈ సమావేశం పై ట్విట్టర్ వేదికగా స్పందించిన గారెత్ విన్ ఓవెన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నారు.
భారతదేశంలో త్వరలో రాబోయే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాల పైన కూడా చర్చ జరిగిందని గారెత్ విన్ ఓవెన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications