బ్రదర్ అనిల్ పరామర్శ: ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జీ

గుంటూరు: గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం ఉదయం బ్రదర్ అనిల్ పరామర్శించారు. దీక్షను భగ్నం చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు చికిత్స అందించిన విషయం తెలిసిందే. జగన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి బుధవారం సాయంత్రం డిశ్చార్జీ చేశారు. ఆయన కాసేపట్లో హైదరాబాదు బయలుదేరుతారు.

జగన్ శరీరంలో కీటోన్స్ స్థాయి సాధారణ స్థితికి వస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆయనను బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి జగన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం జగన్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Brother Anil meets YS Jagan in Guntur hospital

జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్ సాధారణ స్థాయికి చేరుకున్నాయి. 4 గంటల్లో కీటోన్స్ సాధారణ స్థాయికి వస్తాయని చెప్పారు. జగన్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు పరామర్శిస్తున్నారు.

మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వారు ఆ పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+