సోదరితో వివాహేతర సంబంధం అంటగట్టినందుకు హత్య

విశాఖపట్నం: నిత్యం తన చెల్లెలను వేధించడంతోపాటు, ఆమెతో తనకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టడాన్ని తట్టుకోలేని ఓ సోదరుడు తన బావమరిదిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.

గబ్బంగి పంచాయతీ పనసపల్లికి చెందిన పాంగి తిరుపతి రావు(40) చిన్నాన్న కుమార్తె పార్వతమ్మను జీ మాడుగుల మండలం సింగర్భకు చెందిన చిట్టిబాబు(35)కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం చిట్టిబాబుతో అతడి కుటుంబాన్ని పనసపల్లికి తెచ్చిన తిరుపతి రావు అతడికి కొన్ని పశువులను అప్పగించి పశువుల కాపరిగా ఉంచాడు.

Brother attacked on brother in law

గత ఏడాది ఇద్దరి మధ్య మసస్పర్థలు రావడంతో తన భార్యతో తిరుపతి రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ చిట్టిబాబు ప్రచారం చేయడం ప్రారంభఇంచాడు. మద్యం తాగి వచ్చి గొవడపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో పార్వతమ్మ శనివారం కూలీ పనుల కోసం వెళ్లింది.

అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంట్లో భర్త చనిపోయి ఉండటంతో పార్వతమ్మ..సమీపంలోనే ఉన్న సోదరుడు తిరుపతి రావు ఇంటికెళ్లి వదినకు చెప్పింది. చిట్టిబాబు దుష్ప్రచారాన్ని తట్టుకోలేక అతనిని చంపేశానని చెప్పి తిరుపతి రావు గ్రామం వదిలి వెళ్లాడని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

హైవేపై దొంగతనం

జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తకోట నుంచి వనపర్తి వెళ్ళే దారిలోని గుంపు గట్టు దగ్గర ఒక కారు పై దాడి చేశారు. కారులో ఉన్న వారిని గాయపరచి వారివద్ద ఉన్న నగదు లాక్కున్నారు. అదే దారిలో వస్తున్న ఓ అంబులెన్సు పై కూడా దాడి చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+