APలో 'వారి' కోసం KCR రాజకీయ పాచిక!!
భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులైన తర్వాత ఆ పార్టీ తదుపరి అడుగు ఎటువైపు వేయబోతోందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. తోట నియామకంద్వారా ఏపీలో బీఆర్ఎస్ ఏం చేయబోతోందనేది స్పష్టత వచ్చింది. తెలుగుదేశం-జనసేన ఓటుబ్యాంకుపైనే ప్రత్యేకంగా దృష్టిసారించి అందులో చీలిక తీసుకురావడంద్వారా పరోక్షంగా వైసీపీకి, ప్రత్యక్షంగా ఓటుబ్యాంకు శాతం పెంచుకునేందుకు కేసీఆర్ విరచించిన ప్రణాళికగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం దాదాపు ఖాయమే. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేయడంవల్ల అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీచేయడంవల్ల దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళతానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో వైసీపీ జనసేనపై యుద్ధం ప్రకటించింది. ఇరుపార్టీలకు చెందిన నేతలు, వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

కనీసం 6 శాతం ఓటుబ్యాంకు వచ్చేలా..
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య స్నేహ సంబంధాలున్నాయి. మొదటి నుంచి ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఒకటి, రెండు అంశాల దగ్గర మినహా చెప్పుకోగదగ్గ వైరం కూడా లేదు. ఈ తరుణంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణకు లాభం. తెలంగాణకు లాభం కలగాలంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావాలి.
గత ఎన్నికల్లో చేసినట్లుగా ఈసారి కూడా సాయం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారు. ఉత్తరాంధ్రతోపాటు కాపు ఓటుబ్యాంకును చీల్చడంద్వారా బీఆర్ఎస్ కు 6 శాతం కనీస ఓటుబ్యాంకు వచ్చేలా చూసుకుంటున్నారు.

చీలిక ద్వారానే అనుకున్న లక్ష్యం?
వెలమ సామాజికవర్గానికి చెందిన నియోజకవర్గాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలపై కూడా బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిపెట్టింది. తన సొంత సామాజికవర్గం వెలమల నుంచి, కాపుల నుంచి, అమరావతి మద్దతు తెలియజేయడంద్వారా కమ్మ సామాజికవర్గం నుంచి ఓట్లు చీల్చడమే భారత రాష్ట్ర సమితి ప్రధాన లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో చంద్రబాబు సభలద్వారా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఏపీలో ఆ పార్టీ ఓటుబ్యాంకు చీల్చడంద్వారా టీడీపీని తెలంగాణలో నిలవరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. చివరకు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications