ఏపీలో ఆ పార్టీ కథ ముగిసింది?
ఏపీలో ఆ రాజకీయ పార్టీ కథ ముగిసిందనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ ఏదో కాదు.. భారత రాష్ట్ర సమితి. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశవ్యాప్తంగా విస్తరిద్దామని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రయత్నించారు.
అందులో భాగంగా ఏపీలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం నిర్వహించబోతున్నామని, అన్ని ప్రధాన పార్టీలకు ధీటుగా స్థానాలను సంపాదిస్తామని బీఆర్ఎస్ తీవ్రమైన ప్రచారం చేసింది.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు కూడా పార్టీలో చేరారు. తర్వాత విశాక స్టీల్ బిడ్ లో సింగరేని కూడా పాల్గొంటుందని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్రలో విస్త్రతగా కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. తీరా ఇన్ని చేస్తే పురుటిగడ్డ తెలంగాణలోనే పార్టీ ఓటమిపాలైంది. నాయకులంతా ఒక్కరొక్కరుగా పార్టీని వదిలివెళుతూ విమర్శలు చేస్తుంటే బంగారు తెలంగాణ అని పాలకులు అప్పటివరకు చెప్పినవన్నీ ఉత్తిమాటలే అని అని తేలిపోతోంది.
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఏపీలోని ఆ పార్టీ నేతలు కేసీఆర్ ను కలవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఫోన్లను కేసీఆర్ ఎత్తడంలేదని తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నాయి. బీఆర్ఎస్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. త్వరలోనే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రావెల కిషోర్ బాబు కొన్నాళ్ల క్రితమే వైసీపీలో చేరారు. ఈ పరిణామాలన్నీ గమనించిన రాజకీయ విశ్లేషకులు భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యాయం ఏపీలో దాదాపుగా ముగిసినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications