యాచకుడిని బండ రాయితో మోది చంపారు, ముళ్ల పొదల్లో మూడేళ్ల బాలిక మృతదేహం

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. యాచకుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గుంతకల్లు రైల్వే స్టేషన్‌ ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫాం మీద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 40 ఏళ్ల యవసున్న ఓ యాచకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టడంతో అపస్మారకస్ధితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Brutal murder in guntakal railway station

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే యాచకుల మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారి తీసిందని రైల్వే పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రైల్వే ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

కృష్ణా జిల్లాలో మూడేళ్ల బాలిక హత్య

జిల్లాలోని కంచిక చర్ల మండలం వేములపల్లిలో సోమవారం మూడేళ్ల బాలిక హత్యకు గురైంది. గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేసి ముళ్ల పొదల్లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అయితే పాప ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. అంతేకాదు సంఘటనా స్ధలంలో పోలీసులు మద్యం సీసాలను కనుగొన్నారు. బాలిక హత్యకు ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+