కడప జెడ్పీ సమావేశం రసాభాస: శ్రీకాంత్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి
కడప జిల్లా జెడ్పీ సమావేశంలో మంగళవారం గందరగోళం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగింది.
కడప: కడప జిల్లా జెడ్పీ సమావేశంలో మంగళవారం గందరగోళం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగింది.
తొలుత అర్బన్ హౌసింగ్ అంశంపై వాగ్వాదం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీటెక్ రవి, శ్రీకాంత్ రెడ్డి వర్గీయులు బల్లల పైన ఉన్న వస్తువులను విసురుకున్నారు. పోడియం ఎదుట వైసిపి సభ్యులు బైఠాయించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలు దొంగలన్నారు. దీనిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications