‘జగ‌న్‌ది రాక్షస.. శిల్పా సోదరులది పిశాచి మనస్తత్వం’: టీడీపీలోకి ఇంతియాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డిపై టీడీపీ నేత, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డిపై టీడీపీ నేత, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిది రాక్షస మనస్తత్వమని, శిల్పా సోదరులది పిశాచి మనస్తత్వం అని మండిపడ్డారు.

చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసమే శిల్పా పార్టీ మారుతున్నారంటూ మండిపడ్డారు. తాను కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని అన్నారు.

budda rajasekhar reddy fires at shilpa chakrapani and YS Jagan

టీడీపీలో చేరిన నంద్యాల ఇంతియాజ్

నంద్యాల విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ అహ్మద్ గురువారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంతియాజ్‌ ప్రిన్సిపాల్‌గా స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.

గతంలో నిర్లక్ష్యానికి గురైన నంద్యాలను అభివృద్ధి బాటలో నిలబెట్టడమే దివంగత నేత భూమా నాగిరెడ్డికి ఇచ్చే నివాళి అన్నారు. కుప్పం తరహాలో నంద్యాలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. అనంతరం ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. నంద్యాల అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ టీడీపీకి అండగా నిలవాల్సిన సమయం ఇదేనన్నారు.

నంద్యాలను గెలిపించి ఇవ్వడమే చంద్రబాబుకు అందించే కానుక అని అన్నారు. గత మూడేళ్లలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌ పెంచడం, రంజాన్‌ తోఫాలు, ఇమామ్‌లకు వేతనాలు ఇవ్వడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+