నారా లోకేశ్‌పై ఆ వ్యాఖ్యలేమిటి: జెసిపై బుద్ధా వెంకన్న ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ తాను చేసిన ప్రకటనపై తమ పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడదు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం

విజయవాడ‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ తాను చేసిన ప్రకటనపై తమ పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడదు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు.

తనపై జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన గురువారం మీడియా సమావేశంలో ఖండించారు. లోకేష్‌పై జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. పద్ధతి మార్చుకోవాలని ఆయన జెసి దివాకర్ రెడ్డికి సూచించారు.

Buddha venkanna condemns JC comments on Nara Lokesh

తమ టిడిపి వల్లనే బిజెపికి నాలుగు సీట్లు వచ్చిన సంగతిని ఆ పార్టీ నేతలు మరిచిపోరాదని ఆయన అన్నారు. బిజెపి నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు ఓ ఎజెండాతో తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. లోకేష్ కోసం రాజీనామాలు చేస్తామని అనడం మెహర్బానీ అని, కుల సంఘం తీర్మానించిందని లోకేష్‌ను మంత్రి చేయడం కాదని జెసి దివాకర్ రెడ్డి బుధవారంనాడు హైదరాబాదులో అన్నారు.

కాగా, లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నవారి జాబితాలో మరో ఎమ్మెల్యే చేరారు. నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే వర్మ కోరారు. నారా లోకేష్ కోసం తాను రాజీనామా చేసి లక్ష మెజారిటీతో గెలిపిస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+