చంద్రబాబు గుండెలపై తన్నారు -టీడీపీ మంత్రి,ఎమ్మెల్యేపై రెచ్చిపోయిన బుద్ధా వెంకన్న..!

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ను టీడీపీ కార్యక్రమానికి పిలిచిన మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషపై ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నాడు చంద్రబాబు ఇంటి పై దాడికి వెళ్లిన జోగి రమేష్ ను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అప్పట్లో తాము జోగిని అడ్డుకున్న సమయంలో జరిగిన వివాదం వంటి అంశాలతో ఫోటోలను బుద్దా ప్రదర్శించారు.
నూజివీడు లో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని బుద్ధా తెలిపారు.

చంద్రబాబు ఇంటి పైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేశ్ అని, నీచంగా దూషణలు చేసి, చంద్రబాబు కు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేశ్ అని బుద్దా ఆరోపించారు. అటువంటి నాయకుడితో టిడిపి మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందన్నారు.
జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటన తో చంద్రబాబు గుండెలు మీద తన్నిన విధంగా ఉందన్నారు. తమ నాయకులను తాను ఏమీ అనలేనని, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని తెలిపారు.

buddha venkanna serious remarks on tdp leaders for inviting ysrcp jogi Ramesh to party event

జోగి రమేష్ ను తాము అడ్డుకుని ఉండకపోతే ఆరోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడన్నారు. తాము అడ్డుకున్న సమయంలో పోలీసులు మా పై దాడి చేశారన్నారు. ఆ గలాటాలో తనకు ఊపిరి అందక కింద పడ్డానని బుద్దా గుర్తుచేసుకున్నారు. చనిపోతాను అని అందరూ అనుకున్నారన్నారు. ఆ పక్కనే అప్పుడు గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు కూడా ఉన్నారన్నారు.

నిన్న జోగి రమేష్ ఉదంతం చూసి ఆశ్చర్య పోయానని బుద్ధా తెలిపారు. చంద్రబాబు, లోకేష్ లు తనకు పదవులు ఇవ్వకపోయినా ఆ కుటుంబం పట్ల విధేయుడిగానే ఉంటానన్నారు. నిన్న నూజివీడు లో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఎలా జరిగినా, అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించాల్సి ఉందని పార్ధసారధి, శిరీషకు తెలిపారు. జోగి రమేష్ ను చూశాక అయినా వేదిక నుంచో, ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సిందన్నారు.

గౌతు లచ్చన్న ఒక కుల నాయకుడు కాదని, ఇవాళ వంగవీటి మోహనరంగాకి లక్షల విగ్రహాలు ఉన్నాయని, అన్ని కులాల వారు ఆరాధించారు కాబట్టే రంగా దేవుడు అయ్యాడని బుద్ధా వ్యాఖ్యానించారు. వాళ్ల అబ్బాయి రాధా కూడా కులాలకు అతీతంగా పని చేస్తున్నారన్నారు. గౌతు శిరీష అంటే తమకు కూడా ఎంతో అభిమానం ఉందన్నారు. కానీ నిన్న జరిగిన ఘటన కారణంగా క్యాడర్ మొత్తం చాలా బాధ పడిందన్నారు. పార్థసారథి, కొనకళ్ల నారాయణ, శిరీష లు ముగ్గురూ సౌమ్యులేనని, కేవలం క్షమాపణ చెబితే సరిపోదు.. క్యాడర్ కు సమాధానం చెప్పాలన్నారు.

గత ప్రభుత్వం లొ తమ మీద ఎన్నో కేసులు పెట్టారని, వాటిపై ఇప్పటికీ విచారణ సాగుతుందని బుద్దా తెలిపారు. మరి ఇప్పుడు పోరాటాలు చేయాలా వద్దా అనే అనుమానం కలుగుతుందన్నారు. జోగి రమేష్ తో కలిసి వేసిక పంచుకున్న నేతలు కార్యకర్తలను శాంతింప చేయాలన్నారు. నారా లోకేష్ ను కలిసి కూడా జరిగిన విషయం వివరించాలన్నారు. జోగి రమేష్ వంటి వ్యక్తులను టిడిపీలో అస్సలు చేర్చుకోకూడదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+