Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు ఏమిచ్చారంటే - ఇదీ అసలు లెక్క..!!

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు దక్కిందేంటి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతోంది. బడ్జెట్ ను ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న ఏపీలోని కూటమి నేతలు స్వాగతించారు. కాగా, తెలంగాణ నేతలు మాత్రం కేటాయింపులు లేకపోవటం పైన విమర్శలు గుప్పించారు. అయితే, గతం కంటే పన్నుల వాటా శాతం పెరిగింది. హైదరాబాద్ కేంద్రంగా హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రకటించారు. ఏపీకి పలు రకాల కేటాయింపులు చేసారు.

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్‌, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహిం చేందుకు ఎర్త్ కారిడార్‌ నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్‌ కోస్ట్‌ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్‌, హైకింగ్‌ సౌకర్యాలను హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, పశ్చిమ ఘాట్లతో పాటు తూర్పు ఘాట్లలో కీలకమైన అరకు లోయలో కల్పించనున్నారు. ఏపీ, తమిళనాడులో పులికాట్‌ సరస్సులో పక్షుల విహారాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. కేంద్రం ప్రకటించిన ఏడు హైస్పీడ్‌ కారిడార్లలో హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం దక్కనుంది.

Budget 2026 AP would be among the mineral-rich states linked for a set of rare earth corridors

రంగాల వారీగా కేటాయింపులు

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్ కు పన్ను రాయితీ ప్రకటించారు. పెద్ద నగర పాలక సంస్థలకు వెయ్యి కోట్ల మేర బాండ్ల ద్వారా నిధులు సమీకరించేందుకు అవకాశం దక్కింది. ఇక, 2026-27 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల్లో రూ.64,362.16 కోట్లు సమకూ రనున్నాయి. అమరావతికి ఏడీబీ నిధులు రూ.1128.91 కోట్లు కేటాయించారు. గ్రామీణ రోడ్‌ ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు. పట్టణ తాగు, మురుగు నీటి నిర్వహణకు రూ.800 కోట్లు. ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు. రహదారులు, వంతెనల పునర్‌నిర్మాణం కోసం రూ.350 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ 100 కోట్లు ప్రతిపాదించారు.

హిందూస్థాన్‌ షిప్‌ యార్డుకు రూ.150 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.3320.39 కోట్లు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.20 కోట్లు ప్రతిపాదించారు. ఇక, తెలంగాణ కు ఈసారి కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో రాష్ట్రానికి కాస్త ఊరట లభించింది. రాష్ట్రానికి మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే అన్ని రకాల పన్నుల మొత్తం నుంచి కొంతమేర తిరిగి పంచుతుంది. గతం లో రాష్ట్రానికి రూ.32,081.88 కోట్లు మాత్రమే వచ్చేవి. 0.072 శాతం పెరగడం వల్ల అదనంగా రూ.1,098.90 కోట్లు పెరిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+