Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇలా, ప్రత్యేకంగా...!!
కేంద్ర బడ్జెట్‌లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి సంబంధించి పలు కీలక ప్రకటనలను చేశారు. .53.47 లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ను తీసుకొచ్చినట్లు నిర్మల వెల్లడించారు. దేశ ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈలో కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిస్తా మని ప్రకటించారు. రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తామన్నారు.
కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మీదుగా 3 హైస్పీడ్ కారిడార్లను ప్రకటిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో కొత్తగా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయి. వీటితో పాటు ముంబయి-పుణె, దిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య కూడా కొత్త కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రకటించారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు.

రంగాల వారీగా కేటాయింపులు
కాగా, ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటా మని నిర్మలా సీతారామన్ తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీకి కేటాయింపుల పైనా స్పష్టత ఇచ్చారు. అమరావతి రాజధాని అభివృద్ధికి (ఏడీబీ నిధులు) రూ.1,128.91 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా రాజధాని అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కోసం (జపాన్ నిధులు) రూ.432.09 కోట్లు.. ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు కేటాయింపులు చూపించారు. ఏపీ పట్టణ త్రాగు, మురుగు నీటిపారుదల నిర్వహణకు రూ.800 కోట్లు.. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు కేటాయింపులు చేసారు. ఏపీలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం రూ.350 కోట్లు కేటాయించారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆర్దికంగా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications