కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కడ..!!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని, వంశీ సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీని టార్గెట్ చేస్తూ ఈ ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజా ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇద్దరి పైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి పైన టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు.
అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాక.. వల్లభనేని వంశీ వంటి వాళ్లు ఊరొదలి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ను దూషించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ దాడి చేయించారని ఆరోపించారు. రాజకీయభిక్ష పెట్టిన పార్టీ, నాయకుడిపైనే ఆయన విషం చిమ్మారని మండిపడ్డారు.

ఇవాళ అధికారం పోగానే దాక్కుని బతుకుతున్నారన్నారు. వంశీ క్షమాభిక్షకు కూడా అర్హుడు కాదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. వంశీ నమ్మక ద్రోహి, అతనిపై ఎవ్వరూ జాలిపడొద్దన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక కుట్రలు చేశారన్నారు. వైఎస్ చనిపోతే వంశీ పార్టీ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అతను చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. ఆయనికి బిల్డప్ ఎక్కువ విషయం తక్కువని ఎద్దేవా చేసారు. కిరాయి మనుషులను అడ్డుగా పెట్టుకుని బతుకుతున్నారుని వ్యాఖ్యానించారు.
వంశీ చాలా పిరికి వ్యక్తి, అందుకే పారిపోయారని... అతను ఎక్కడ కనిపించినా పోలీసులకు అప్పగించాలని ప్రజల్ని కోరారు. వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నానిలు ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరంతా ఎలా మాట్లాడారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. మమ్మల్ని అలా తిడుతుంటే వద్దని ఏనాడైనా జగన్ చెప్పారా అంటూ నిలదీసారు. ఎన్నికలకు ముందు రంకెలు వేసిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ బుద్దా వెంకన్న పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications