'సింగపూర్ కంపెనీలతో బాబు మ్యాచ్ ఫిక్సింగ్, స్విస్ ఛాలెంజ్ రద్దు చేయాల్సిందే'
హైదరాబాద్ : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు అనుసరిస్తోన్న స్విస్ ఛాలెంజ్ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో.. వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్యెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా.. హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి.. చంద్రబాబు తీరు చూస్తోంటే అసలు రాష్ట్రంలో పాలనా కొనసాగుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.
ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుందన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన ఆయన.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న విషయం మాత్రం అర్థమవుతోందన్నారు. సింగపూర్ కంపెనీల మీద సొంత అల్లుడి కంటే ఎక్కువగా చంద్రబాబు ప్రభుత్వం ప్రేమ కురిపిస్తోందన్నారు. సింగపూర్ కంపెనీల ఒప్పందాలు పారదర్శకంగా జరగలేదని కోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు స్విస్ ఛాలెంజ్ లోనే ఉన్నాయన్నారు బుగ్గన.












Click it and Unblock the Notifications