MPగా పోటీచేయడానికి సిద్ధమవుతున్న మంత్రి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత రుణంలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని అధికారులతో సత్సంబంధాలు కొనసాగించి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విజయం సాధించారు.

తరుచుగా ఢిల్లీ పర్యటన

తరుచుగా ఢిల్లీ పర్యటన

రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే క్రమంలో తరుచుగా ఢిల్లీ పర్యటించి మంత్రి బుగ్గన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవదలుచుకోలేదని, ఆయన పార్లమెంటు సభ్యుడవ్వాలనుకుంటున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో డోన్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసే బదులు నంద్యాల నుంచి లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి జగన్ కు చెప్పినట్లు బుగ్గన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న బుగ్గన

కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న బుగ్గన


ప్రస్తుతం నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో దివంగత పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి రెండుసార్లు విజయ సాధించారు. బుగ్గన నియోజకవర్గం డోన్ కూడా నంద్యాల పరిధిలోకే వస్తుంది. వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బుగ్గన కష్టపడి పనిచేసే తత్వమున్నవారు. అంతేకాకుండా సబ్జెక్టుపై పూర్తిస్థాయి కమాండ్ ను కలిగివున్నారు. ఇంగ్లిషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండటం కూడా లోక్ సభకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 నవరత్నాల విజయంలో కీలకపాత్ర

నవరత్నాల విజయంలో కీలకపాత్ర


ముఖ్యమంత్రి జగన్ తన నవరత్నాలకు సంబంధించిన పథకాలకు నిధుల కొరత లేకుండా చూడటంలో బుగ్గన విజయం సాధించారు. అంతేకాకుండా శాసనసభా వ్యవహారాలపై మంచి కమాండ్ ఉంది. ప్రజల సమస్యలతోపాటు ప్రతిపక్షాలతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై పంచ్ లు వేస్తారనే పేరుంది. బుగ్గన అవసరాలు రాష్ట్రానికి ఎంత అవసరమో ముఖ్యమంత్రి కి తెలుసు. ఆ స్థానాన్ని ఎవరితోనైనా భర్తీ చేయవచ్చు అని భావిస్తే నంద్యాల నుంచి ఎంపీగా పోటీచేయడం ఖాయమైనట్లే. అయితే అదంతా ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి యస్ అనే పదం వస్తేనే. !!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+