కూటమి పాలనపై ప్రజల్లో ఫీలింగ్ ఇదే..!!
ఏపీలో కూటమి పాలన పైన ప్రజల్లో నెగటివ్ ఫీలింగ్ మొదలైందని మాజీ మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. వంద రోజుల పాలన పూర్తయినా ఇంకా వైసీపీ పైన విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు నెలల కాలంలోనే 43 వేల కోట్ల అప్పులు చేసారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని.. ఎన్నికల హామీల అమలు గురించి ఆలోచనే లేదని ఆరోపించారు.
లక్ష్యం లేకుండా
ఏపీలో మూడు పార్టీల ప్రభుత్వం లక్ష్యం లేకుండా సాగుతోందని బుగ్గన విమర్శించారు. వంద రోజుల పాలన పూర్తవుతున్నా ప్రభుత్వం పైన ప్రజల్లో గుడ్ ఫీలింగ్ రాలేదన్నారు. అన్నింటా జగన్ పైన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతీ దానికి జగన్ పై నెపం నెడుతోందని విమర్శించారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి చూస్తున్నారని..మహిళలతో సహా ఎవరికీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయటం లేదని ధ్వజమెత్తారు.

అప్పుల లెక్కలు
ప్రభుత్వం వచ్చిన వెంటనే దాడులు పెరిగాయన్నారు. ఎన్నికల సమయంలో తాము 14 కోట్ల అప్పులు చేసినట్లు ప్రచారం చేసిన కూటమి నేతలు అది తప్పని తమ శ్వేత పత్రాలతోనే నిరూపించారని వివరించారు. 2005 లోనే పోలవరం పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడే పనులు ప్రారంభిస్తున్నట్లుగా ప్రభు త్వం వ్యవహరిస్తోందని బుగ్గన చెప్పుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 8 వరకు పోలవరం పనులు ప్రారంభించ లేదని గుర్తు చేసారు. 2016లో పోలవరం కు 55 వేల కోట్లు అవసరం కాగా..నాడు ఇదే ప్రభుత్వం 20 వేల కోట్లకు ఒప్పుకుందని బుగ్గన పేర్కొన్నారు.
ఏం చేయకుండానే
పోలవరం కోసం వైసీపీ చేసిన పనులను కూడా తామే చేసామని ప్రభుత్వం చెప్పుకుంటుందని బుగ్గన ఎద్దేవా చేసారు. నాడు టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం సరి చేసిందన్నారు.ఈ రోజు పోలవరానికి 12 వేల కోట్లకు పైగా నిధుల మంజూరు నాడు వైసీపీ చేసిన ప్రయత్నామేనని వివరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని బుగ్గన విమర్శించారు.
-
‘మెగా’ గుడ్ న్యూస్: ఇక 21 రకాల వైకల్యాలకు ‘సదరం’ సర్టిఫికెట్లు! -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..!












Click it and Unblock the Notifications