కిలాడి లేడీ పావని కేసు కొత్త చిక్కులు: ఎవరీ బుల్లెట్ సురేశ్?
అమరావతి: రాష్ట్ర బీసీ సంక్షేమ నాయకుడు, చిత్తూరుకు చెందిన అధికార పార్టీ నేత బుల్లెట్ సురేశ్ కేసులతో సతమతమవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇతగాడు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
ఇటీవలే కోల్‌కత్తా విమానాశ్రయంలో పోలీసులు అదుపులో తీసుకున్న ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వీటితో పాటు తాజాగా చిత్తూరులో పలువురు మహిళల్ని మోసం చేసి 8 కిలోల వరకు బంగారు ఆభరణాలు కాజేసిన పావని అనే మహిళ కేసు ఇప్పుడు బుల్లెట్ సురేశ్‌కు కొత్త చిక్కులు తెచ్చింది.
పావనిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు... ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని వన్‌టౌన్ పోలీసులు సురేష్‌కు నోటీసులు జారీ చేయడం చిత్తూరులో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఎర్రచందనం స్మిగ్లింగ్ కేసులో బుల్లెట్ సురేశ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడిపిన సురేశ్ ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడు. కాగా, గతేడాది నవంబర్‌లో చిత్తూరు మేయర్‌గా ఉన్న అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ల హత్య కేసులో ఆరోపణలు రావడంతో సురేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవలే బెయిల్‌పై విడదలయ్యాడు.

అంతా బాగుందనున్న సమయంలో కోల్‌కత్తా విమానాశ్రయంలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ భార్య సంగీత చటర్జీను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తప్పుడు గన్ లెసైన్సును సురేష్‌కు ఇవ్వడంతో పాటు, ఓ తుపాకీని కూడా బుల్లెట్ సురేశ్‌కు అమ్మినట్టు విచారణలో వెల్లడైంది.
దీనికి తోడు తాజాగా చిత్తూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని పలువురు మహిళలను మోసం చేసి 8 కిలోల బంగారు ఆభరణాలను అపహరించారు. బాకీలను సమయానికి తీర్చని వారిపై పావని, మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ, హరిదాస్‌లతో కలసి తమ ను బెదిరించినట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చింటూ తన అనుచరులతో వెళ్లి బెదరింపులకు పాల్పడేవాడని, ఆపై బాధితుల నుంచి బంగారం, ఆస్తులను పావని బలవంతంగా తీసుకునేదని పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పావని, ఆమె భర్త చరన్‌లను అరెస్టు చేసి కోర్టు అనుమతితో 9 రోజుల కస్టడీకి తీసుకున్నారు.
మాయలేడీ పావని కేసులో ట్విస్ట్: చింటూకు ఇచ్చిన రూ. 50 లక్షలు సీజ్
పోలీసుల విచారణలో బంగారు ఆభరణాల మాయం వెనుక బుల్లెట్ సురేశ్ పాత్ర కూడా ఉందని వెల్లడైంది. దీంతో పోలీసులు బుల్లెట్ సురేశ్‌కు నోటీసులు జారీ చేశారు. బుల్లెట్ సురేశ్ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications