Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు బంప‌రాఫ‌ర్‌.. ఫ్రీ వ‌ర‌ల‌క్ష్మి వ‌త్రానికి ద‌ర‌ఖాస్తులు..

బెజ‌వాడ ఇంద్ర‌కీలాద్రీపై వెల‌సిన క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి వెళ్లే భ‌క్తుల‌కు బంప‌రాఫ‌ర్‌. ఆగ‌స్టు 16వ తేదిన వ‌ర‌ల‌క్ష్మి వ‌త్రం సంద‌ర్భంగా అమ్మవారు వరలక్ష్మీ దేవిగా అవ‌త‌రించున్నారు. ఇందులో భాగంగా భ‌క్తుల‌కు ఉచిత సామూహిక వ‌రల‌క్ష్మి వ్ర‌త కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం భ‌క్తుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. రెండో శుక్రవారం కావడంతో క‌న‌క‌దుర్గమ్మ అమ్మ‌వారిని వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. వీటితో పాటు ఈ నెల 17వ తేది నుంచి 20వ తేది వరకు పవిత్రోత్సవాలు కూడా నిర్వహించ‌నున్నారు. ఆగ‌స్టు 23 వ తేదిన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించాలని ఆల‌య అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక‌, ఫ్రీ వరలక్ష్మి వ్రతం కోసం భ‌క్తులు దరఖాస్తు చేసుకోవాలని ఆల‌య‌ అధికారులు కోరారు.

ఈ నెల 23వ తేదిన సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించ‌నున్నారు. ఇక‌, ఆ రోజు ఉదయం ఏడుగంట‌ల‌ నుంచి తొమ్మిది గంటల వరకు ఆర్జిత సేవ టికెట్‌ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారు. అనంత‌రం ఉదయం ప‌దిగంట‌ల‌ నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా ఫ్రీ వ‌రల‌క్ష్మి వ్ర‌తానికి అప్ల‌య్ చేసుకున్న వారికి మాత్ర‌మే వరలక్ష్మీ వ్రతాన్నినిర్వ‌హిస్తారు. క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో నిర్వ‌హించే ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్‌కు 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుద‌ని ఆల‌య అధికారులు పేర్కొన్నారు.

Bumper offer for Kanakadurgamma devotees Applications for free Varalakshmi Vatram

ప‌విత్రోత్స‌వాలు..

ఆగ‌స్టు 17వ తేది నుంచి 21 వరకు ఫ్రీ వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాల్గొనే భ‌క్తులకోసం దరఖాస్తులు స్వీకరిస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు. వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక ఆ మ‌హిళ‌ల‌కు రూ.300 దర్శనం క్యూలైన్లో అమ్మ‌వారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆల‌య అధికారులు తెలిపారు.ఈ సంద‌ర్భంగా వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉండేందుకు అధికారులు త‌గు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు దుర్గ‌మ్మ కొండ‌పై ఆగస్టు17 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

ఇందులో భాగంగా అమ్మవారికి ఈ నెల 17న సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతి, 18వ తేదిన ఉద‌యం మూడు గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం వంటి కార్య‌క్రమాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. వీటితోపాటు ఉదయం తొమ్మిది గంటలకు భక్తులను సర్వ దర్శనానికి అనుమతించ‌నున్నారు. ఆగ‌స్టు 19వ తేదిన మండపారాధన, మూలమంత్ర హవనాలు, వేదపారాయణలు, హారతి, మంత్రపుష్పం వంటి కార్య‌క్ర‌మాలు ఉంటాయి. అలాగే ఈ నెల 20వ తేదిన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసనతో పవిత్రోత్సవాలు ముగించ‌నున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+