ఏపీలో ఓటు లేకపోయినా.. బన్నీ వాసు, జానీ మాస్టర్‌కు పవన్ బంపర్ ఆఫర్
Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోన్నారు.
చంద్రబాబు నిర్వహిస్తోన్న ఈ సభలు.. టీడీపీ- జనసేన మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలకు అద్దంపడుతున్నాయి. పలు అంశాలపై ఈ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏకాభిప్రాయానికి రావట్లేదు. అభ్యర్థుల ప్రకటన, సీట్ల పంపకాల వ్యవహారంలో చోటు చేసుకుంటోన్న జాప్యం ఈ పరిణామాలకు దారి తీస్తోంది.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశంతో సంబంధం లేకుండా జనసేన పార్టీ.. ప్రత్యేకంగా ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 21 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. ఛైర్మన్, ఇద్దరు వైస్ ఛైర్మన్లు, కార్యదర్శి, ముగ్గురు జాయింట్ కార్యదర్శులు, 14 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. విజయవాడ అర్బన్‌తో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి వారిని ఎంపిక చేశారు.
ఈ ప్రచార కమిటీకి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మెగాస్టార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాలకు అత్యంత ఆప్తుడిగా, విశ్వసనీయుడిగా బన్నీ వాసుకు పేరుంది. ఇదివరకే ఆయన జనసేన పార్టీలో చేరారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఇక క్రియాశీలకంగా మారనున్నారు.
టాలీవుడ్‌కే చెందిన షేక్ జానీ మాస్టర్.. ఈ ప్రచార కమిటీకి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయనతో పాటు యాతం నగేష్ బాబు వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. కార్యదర్శిగా వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా పోగిరి సురేష్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేష్ కుమార్‌ను నియమించారు.
ఈ కమిటీలో.. కంచరాన అనిల్- శ్రీకాకుళం, కోట్ల కృష్ణ- విజయనగరం, పీలా రామకృష్ణ- విశాఖపట్నం, శిఖ బాలకోటేశ్వరరావు- గుంటూరు, జడ బాలనాగేంద్ర- ప్రకాశం, ఈగి సురేష్- నెల్లూరు, కే దినేష్ జైన్- చిత్తూరు, ఏవీ చలపతి- అనంతపురం, పత్తి విశ్వనాథ్ (విస్సు)- కడప, కర్నాటి శ్రీరాములు- కర్నూలు, తులా రామలింగేశ్వరరావు (లింగా)- పశ్చిమ గోదావరి, గడ్డం శివ- తూర్పు గోదావరి, పులి వెంకట కామేశ్వరరావు- కృష్ణా, తిరుపతి సురేష్- విజయవాడ అర్బన్.. సభ్యులుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications