బాలికపై బస్సు డ్రైవర్ రేప్: లక్షన్నరకు బేరం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ గిరిజన బాలికపై బస్సుడ్రైవర్ విశ్వానాథ్ అత్యాచారం చేశాడు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీఈపీజెడ్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. తాను చేసిన నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు అతను బాలికతో బేరమాడాడు.

జరిగిన సంఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడానికి రూ. 1.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారం కేసును సుమోటోగా నమోదు చేశారు. పోలీసులు నిందితుడు విశ్వనాథ్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications