Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరో, ఎక్కడినుంచో?: వైజాగ్ బిజినెస్‌మెన్‌పై హత్యాయత్నం, మిస్టరీ(ఫోటోలు)

విశాఖపట్నం: ఎక్కడినుంచి వచ్చారో.. ఎందుకొచ్చారో తెలియదు.. ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. దోపిడీ ముఠాలా?.. వ్యక్తిగత కక్షలా? అన్నది ఇంకా తేలలేదు గానీ.. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మాత్రం కన్నుమూశాడు.

విశాఖపట్నంలో విక్రమ్ అనే క్రేన్ల వ్యాపారిపై హత్యాయత్నం నగరంలో కలకలం రేపింది. సోమవారం పట్టపగలే కొంతమంది అగంతకులు విక్రమ్ ఇంట్లోకి చొరబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన విక్రమ్ డ్రైవర్, భార్యనూ గాయపరిచారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ హోటల్ ఎదురుగా ఉన్న సీసర్ఫ్ అపార్ట్ మెంటులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సోమవారం సాయంత్రం:

సోమవారం సాయంత్రం:

సీసర్ఫ్ అపార్ట్ మెంటులోని ప్లాట్ నంబర్-6(ఎఫ్-6) విక్రమ్ కుటుంబం ఉంటోంది. సోమవారం సాయంత్రం 4-5గం. మధ్యలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు తట్టారు. విక్రమ్ కారు డ్రైవర్ జనార్థనరావు తలుపు తెరిచాడు.

విక్రమ్ ఎక్కడంటూ బెదిరించి:

విక్రమ్ ఎక్కడంటూ బెదిరించి:

జనార్దనరావు తలుపు తీయడమే ఆలస్యం.. అతన్ని నెట్టుకుంటూ అగంతకులు లోపలికి వచ్చారు. ఇంట్లోకి వచ్చీ రాగానే.. విక్రమ్ ఎక్కడంటూ గదమాయించారు. అరుపులు విన్న విక్రమ్ భార్య జ్యోతి హాల్లోకి రావడంతో.. ఆమెను కూడా విక్రమ్ ఎక్కడంటూ కేకలు వేశారు.

బెడ్‌రూం వద్ద వాగ్వాదం:

బెడ్‌రూం వద్ద వాగ్వాదం:

అగంతకుల అరుపులతో బెంబేలెత్తిపోయిన జ్యోతి బెడ్ రూంలో ఉన్న భర్తను పిలిచేందుకు అటువైపు పరుగు పరుగున వెళ్లింది. అప్పటికే అరుపులు విని విక్రమ్ బెడ్ రూం నుంచి బయటకు వస్తున్నాడు. జ్యోతి వెనకాలే వెళ్లిన అగంతకులు.. విక్రమ్ ను చూడగానే ఊగిపోయారు. హాల్లోకి పదండి మాట్లాడుకుందామని చెబుతున్నా వినకుండా.. వాగ్వాదానికి దిగారు.

అంతలోనే కత్తులతో హత్య:

అంతలోనే కత్తులతో హత్య:

వాగ్వాదం జరుగుతుండగానే వెంట తెచ్చుకున్న కత్తులతో అగంతకులు విక్రమ్ పై విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా అతనిపై దాడి చేశారు. దీంతో విక్రమ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. అడ్డుకోబోయిన జ్యోతి, జనార్దన్ రావులపై కూడా దాడికి పాల్పడ్డారు. అనంతరం అగంతకులు అక్కడినుంచి పరారయ్యారు.

ఆసుపత్రికి తరలించి:

ఆసుపత్రికి తరలించి:

రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉన్న విక్రమ్ ను, అతని భార్య జ్యోతి, డ్రైవర్ జనార్దన్ రావులు కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆపై త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో అపార్ట్ మెంటు వాసుల్లోను భయాందోళన మొదలైంది.

ఆర్థిక లావాదేవీలే కారణమా?:

ఆర్థిక లావాదేవీలే కారణమా?:

వ్యాపారాల్లో తలెత్తిన విభేదాలే విక్రమ్ పై హత్యాయత్నానికి దారి తీసి ఉంటాయన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో విక్రమ్ కు వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన ముఠాలో కొంతమంది హిందీ, ఇంగ్లీష్, మరికొంతమంది తెలుగు మాట్లాడినట్లు చెప్పారు.

సంఘటనా స్థలానికి వెళ్లి:

సంఘటనా స్థలానికి వెళ్లి:

సంఘటనపై సమాచారం అందుకోగానే పోలీస్ కమిషనర్ టి.యోగానంద్, డీసీపీ ఫకీరప్ప, క్రైమ్ డీసీపీ షిమోషి బాజ్ బాయ్, ఏసీపీ నర్సింహమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసును చేధించేందుకు ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. నగరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. కేసును త్రీటౌన్ సీఐ వెంకటరావు దర్యాప్తు చేస్తున్నారు.

విషమంగా విక్రమ్ పరిస్థితి:

విషమంగా విక్రమ్ పరిస్థితి:

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ విక్రమ్ పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలోని ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఉదర భాగంలో బలమైన కత్తిపోట్లకు గురవడంతో.. తీవ్ర రక్తం స్రావం జరిగి ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు తెలిపారు. దాడిలో గాయపడ్డ జ్యోతి, జనార్దనరావులు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+