జగన్ పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు..!!
ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. రప్ప రప్పా డైలాగ్స్ తో రాజకీయం హీటెక్కు తోంది. జగన్ పల్నాడు పర్యటనలో కార్యకర్తలు ప్రదర్శించిన ప్ల కార్డులు వివాదాస్పదం అయ్యాయి. ఈ వివాదం పై జగన్ స్పందించిన తీరు పైన టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా టీడీపీ ముఖ్య నేత గోరండ్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్ చేసారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ ప్లకార్డులు.. భాషను సమర్థిస్తున్న జగన్ తల నరకచ్చు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ పర్యటనలో ప్రదర్శించిన ప్లకార్డుల గురించి ఇచ్చిన విశ్లేషణ పైన గోరంట్ల స్పందించారు. జగన్ పర్యటనలో ఒక అభిమాని తన ప్లకార్డు పైన గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్లు నరుకుతామంటే ..దానితో తప్పు ఏముందని అంటున్నావు.. నేను అంటున్నా.. రాజారెడ్డి రాజ్యంగంతో ప్రజలను వంచించి, హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు?' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా జగన్ పర్యటన లు ఉన్నాయని విమర్శించారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు ఎర్రగడ్డ లో చికిత్స చేయించాలని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ప్రజలు ద్రోహం చేసారని జగన్ భావిస్తూన్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ కి రాడు.. ప్రజా సమస్యలపై మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేసారు. రౌడీ గంజాయి మూకలను వెనక వేసుకుని తిరుగుతున్నారని మండి పడ్డారు. తక్షణం అధికారం కావాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చెయ్యాలనే లక్ష్యం తో ఉన్నారని ఫైర్ అయ్యారు. తక్షణం సీఎం కుర్చీ లో కూర్చోవాలా...సొంత బాబాయ్ ను హత్య చేయించి నేరాన్ని మాఫీ చేయించేందుకు తిప్పలు పడుతున్నారంటూ బుచ్చయ్య వ్యాఖ్యానించారు. పరిటాల హత్య తో పాటు అనేక హత్యాలతో జగన్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జగన్ వెళ్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications