జగన్ ఏమనుకున్నారో గానీ..: కర్నూలు జిల్లా వైసీపీలో భారీ మార్పులు

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడిక‌ల్ కాలేజీల‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ ప‌ద్ధ‌తిలో ప్రైవేట్‌ప‌రం చేయబోతోండటం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో గతంలో కీలక సమావేశాలను నిర్వహించిన ఆయన క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలపై కార్యాచరణను ప్రకటించారు. మెడికల్‌ కాలేజీల అంశంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇందులో భాగమే.

Butta Renuka Names as New Kurnool Lok Sabha Incharge

ఈ పరిణామాల మధ్య కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కర్నూలు లోక్ సభ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుక నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓ ప్రకటన జారీ చేసింది. ఆమెతో పాటు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్యయ బాధ్యతలను కడిమెట్ల రాజీవ్ రెడ్డి చేతికి అప్పగించారు. ఆయన.. మాజీ శాసన సభ్యుడు చెన్నకేశవరెడ్డి మనవడు.

2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు బుట్టా రేణుక. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బీటీ నాయుడిపై 44 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. మహానాడు వంటి పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

Take a Poll

సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ- 2019 నాటి ఎన్నికల్లో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పోటీకి దింపింది గానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత రేణుక మళ్లీ వైఎస్ఆర్సీపీ దగ్గరయ్యారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను పర్యవేక్షిస్తోన్నారు. ఇప్పుడు తాజాగా ఆమెకు కర్నూలు లోక్ సభ సమన్వయకర్తగా నియమించారు జగన్. ఆ బాధ్యతలను రాజీవ్ రెడ్డికి అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+