• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో రేషన్ థియేటర్లు: సినిమా టికెట్లపై ఆర్జీవీ ఫార్ములా: ఎక్కువకు కొని..తక్కువ రేటుకు అమ్ముకోండి

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- తెలుగు చలన చిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణగట్లేదు. సంక్రాంతి సీజన్ మొదలైనందున- కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్లినప్పటికీ- రాధేశ్యామ్, భీమ్లా నాయక్, బంగార్రాజుతో సహా చిన్న సినిమాలు సూపర్ మచ్చి, డీజే టిల్లు విడుదల కాబోతోన్నాయి.

 పెట్టిన పెట్టుబడి కోసం..

పెట్టిన పెట్టుబడి కోసం..

డీజే టిల్లు మినహాయిస్తే.. మిగిలిన వన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నవే. ప్రత్యేకించి- రాధేశ్యామ్. పాన్ ఇండియా సూపర్ స్టార్ గుర్తింపును పొందిన ప్రభాస్-పూజా హెగ్డే నటించిన ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయల పైమాటే. ఏపీ పెద్ద మార్కెట్. అసలే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆంక్షల మధ్య థియేటర్లు నడుస్తున్నాయి.

ఏపీలో టికెట్ల రేట్లను పెంచుకోవడంపై

ఏపీలో టికెట్ల రేట్లను పెంచుకోవడంపై


అదే సమయంలో- ఏపీలో సినిమా టికెట్ల రేట్లను జగన్ సర్కార్ తగ్గించడం.. కలెక్షన్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొని ఉంది. ఇప్పుడున్న ఆంక్షలకు తోడు ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల వచ్చే కలెక్షన్లు భారీగా తగ్గుతాయనని ఇండస్ట్రీ బిగ్‌షాట్స్ అనుమానిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో- మరోసారి జగన్ సర్కార్‌తో సంప్రదింపులు నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నాయి. టికెట్ల రేట్లను పెంచుకోవడం వల్ల నార్త్‌లో వచ్చే నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోవచ్చనే అభిప్రాయం ఉంది.

ఈ వివాదంపై ఆర్జీవీ రాజీ ఫార్ములా..

ఈ వివాదంపై ఆర్జీవీ రాజీ ఫార్ములా..


ఈ పరిస్థితుల మధ్య దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లను సంధించారు. పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ ఏకంగా డజను ట్వీట్లు సంధించారాయన. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. సినిమా టికెట్ల నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం- తెలుగు చలనచిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి రాజీ ఫార్ములాతో ముందుకొచ్చారాయన.

ఎక్కువ రేట్లకు కొని..తక్కువకు అమ్ముకోండి..

ఎక్కువ రేట్లకు కొని..తక్కువకు అమ్ముకోండి..

సినిమా నిర్మాతలకు ఎలాంటి నష్టం లేకుండా.. వారు పెట్టిన రేట్లకు ప్రభుత్వమే టికెట్లను కొనుగోలు చేయాలని, వాటిని తక్కువ ధరకు పేదలకు అమ్ముకోవాలని రామ్‌గోపాల్ వర్మ సూచించారు. దీనివల్ల నిర్మాతకు నష్టం రాదు..వైసీపీ ఓటుబ్యాంకు చెక్కు చెదరబోదని అన్నారు. చిత్ర పరిశ్రమకు నష్టం రాకుండా ఉండటానికి తీసుకోబోయే చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకోవాలని ఆయన మంత్రి పేర్నినానికి సూచించారు.

రేషన్ షాపుల తరహాలో.. రేషన్ థియేటర్లు

రేషన్ షాపుల తరహాలో.. రేషన్ థియేటర్లు

రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, పప్పు, నూనె.. వంటి నిత్యావసర సరుకులను పేదల ప్రజలకు తక్కువ రేటుకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టే.. సినిమా టికెట్ల రేట్లను కూడా విక్రయించుకోవాలని రామ్‌గోపాల్ వర్మ సూచించారు. దీనికోసం రేషన్ షాపుల తరహాలో.. రేషన్ థియేటర్లు పెట్టాలని సూచించారు. పేదలకు సినిమా అనేది అత్యవసరంగా ప్రభుత్వం భావించినప్పుడు- విద్య, వైద్యం తరహాలోనే వాటి టికెట్ల రేట్లపై సబ్సిడీ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

నిర్మాతలు కూడా రైతుల్లాంటి వారే..

నిర్మాతలు కూడా రైతుల్లాంటి వారే..

నిర్మాతలు కూడా రైతుల్లాంటి వారేనని రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు ఎలా తీవ్ర నిరాశకు గురవుతారో.. తాము తీసిన సినిమాలకు తగిన టికెట్ ధర లభించనప్పుడు నిర్మాతలు కూడా బాధపడతారని పేర్కొన్నారు. ఫలితంగా సినిమాల నాణ్యత దెబ్బతింటుందని, నాణ్యత తగ్గుతుందని చెప్పారు. దీని ప్రభావం సినీ పరిశ్రమ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలపై పడుతుందని పేర్కొన్నారు.

ఆ టాప్ హీరోల పరిస్థితేంటీ..

ఆ టాప్ హీరోల పరిస్థితేంటీ..

సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం.. అది ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లడం వల్ల పెద్ద హీరోల పరిస్థితి, వారు తీసే సినిమాల నాణ్యత దెబ్బతింటుందని రామ్‌గోపాల్ వర్మ స్పష్టం చేశారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పేర్లను ఆయన ట్వీట్‌లో పొందుపరిచారు. ఎన్నో అంచనాల మధ్య ఆయా హీరోలందరూ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారని చెప్పారు. ప్రొడక్షన్ కాస్ట్ అనుగుణంగా రికవరీ లేకపోతే ట్రాక్ రికార్డులు దెబ్బతింటాయని గుర్తు చేశారు.

English summary
Buy Some tickets from Producers Selling Price and sell the tickets to the poor at low price-RGV comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X