వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీప్ గా వ‌స్తున్నాయ‌ని ఆన్లైన్లో వాహ‌నాలు కొంటున్నారా..! జ‌ర బ‌ద్రం..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : మారుతున్న కాలంలో జ‌న‌జీవ‌నం ఎంతో యాత్రికంగా త‌యార‌య్యింది. కాలంతో పాటు ప‌రుగులు తీసే క్ర‌మంలో కాలాన్ని వ్రుధా చేసుకోవ‌ద్ద‌ని ప్ర‌తిఒక్క‌రూ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంద‌రు కేటుగాళ్లు. షాపింగ్ చేసే స‌మ‌యం లేక ఆన్లైన్లో వ‌స్తువులతో పాటు ఇత‌ర విలువైన ప‌రిక‌రాల‌కు ఆర్డ‌ర్ బుక్ చేసామో ఇక అడ్డంగా బుక్ ఐన‌ట్టే..! మొన్న ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్ బుక్ చేస్తే ఇటుక రాయి డెలివ‌రీ కావ‌డంతో క‌స్ట‌మ‌ర్ ఖంగు తినాల్సి వ‌చ్చింది.

 ప‌రాకాష్ట‌కు చేరుతున్న ఆన్లైన్ మోసాలు..! బెంబేలెత్తిపోతున్న జ‌నాలు..!!

ప‌రాకాష్ట‌కు చేరుతున్న ఆన్లైన్ మోసాలు..! బెంబేలెత్తిపోతున్న జ‌నాలు..!!

ఆన్ లైన్ లో బుకింగ్ లు కొన్ని సంద‌ర్బ‌ల్లో ప‌ర‌వాలేద‌నిపించినా కొన్ని సంద‌ర్బ‌ల్లో మాత్రం బొక్క‌బోర్లా ప‌డ‌ల్సొస్తుంది. ఆన్లైన్లో ఆర్డ‌ర్ చేసింది ఒక‌టైతే అందుకు పూర్తి విరుద్దంగా ఉండే డూప్తికేట్ ఇంటికి వ‌చ్చి అవాక్క‌య్యేలా చేస్తోంది. ఇలాంటి వ్య‌వ‌హ‌రాలు కాసుల‌కు క‌క్కుర్తి ప‌డే కొంత‌మంది డెలివ‌రీ బాయ్స్, వారికి స‌హ‌క‌రించే కొంత మంది మేనేజ‌ర్ స్థాయి ఉద్యోగుల వ‌ల్ల జ‌రిగిపోతుంటాయి. చిన్న చిన్న గ్యాడ్జెట్ లలో మోసం జ‌రిగడ‌మే కాకుండా పెద్ద పెద్ద బుల్లెట్ లాంటి వాహ‌నాల విష‌యంలో మోసాలు జ‌రుగుతున్నాయంటే ఎవ‌రికి చెప్పుకోవాల‌ని జ‌నాలె బెంబేలెత్తిపోతున్నారు.

బోల్తా కొట్టించిన బుల్లెట్‌ కొనుగోలు..! వ్యక్తి నుంచి 1.80 లక్షలు కొట్టేసిన ఆన్‌లైన్‌ మోసగాళ్లు..!!

బోల్తా కొట్టించిన బుల్లెట్‌ కొనుగోలు..! వ్యక్తి నుంచి 1.80 లక్షలు కొట్టేసిన ఆన్‌లైన్‌ మోసగాళ్లు..!!

బుల్లెట్‌ వాహనం కొనుగోలు వ్యవహారం ఓ వ్యక్తిని బోల్తా కొట్టించింది. ఆన్‌లైన్‌ మోసగాళ్ల బారిన పడిన ఓ వ్యక్తి ఏకంగా 1.80 లక్షలు పొగొట్టుకున్నాడు. కరణం సాయికృష్ణ అమ‌రావ‌తిలోని నిడమానూరు రహదారిలో నివసిస్తుంటాడు. ఇతను క్రియేటివ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో పనిచేస్తుంటాడు. కొంత కాలం నుంచి ఇతను రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ కంపెనీకి చెందిన బుల్లెట్‌ వాహనాన్ని కొనుగోలు చేయ‌ల‌ని ప్రయత్నిస్తున్నాడు.

మొన్న స్మార్ట్ ఫోన్ కి బ‌దులు ఇటుక రాయి..! ఇప్పుడు బుల్లెట్ రూపంలో ప‌చ్చి మోసం..!!

మొన్న స్మార్ట్ ఫోన్ కి బ‌దులు ఇటుక రాయి..! ఇప్పుడు బుల్లెట్ రూపంలో ప‌చ్చి మోసం..!!

ఇతను కొద్ది రోజుల క్రితం నుంచి ఓఎల్ఎక్స్‌లో వాహనాల అమ్మకాలను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నాడు. ఇందులో ఓ బుల్లెట్‌ అమ్మకం ప్రకటన ఇతడ్ని ఆకట్టుకుంది. వెంటనే ప్రకటనలో ఉన్న ఫోన్‌ నెంబరుకు ఫోన్‌ చేశాడు. అవతలి వ్యక్తి తన పేరు మంజిత్‌సింగ్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను విమానాశ్రయంలో పనిచేస్తానని నమ్మబలికాడు. వీరిద్దరి నడుమ వాహనం కొనుగోలుకు లక్ష రూపాయ‌ల‌కు బేరం కుదిరింది. ఈమేరకు మంజిత్‌సింగ్‌కు సాయికృష్ణ విడతల వారీగా ఓ లక్షను ఆన్‌లైన్‌ ద్వారా పంపాడు. ఆ తర్వాత నాలుగు రోజులకు మంజిత్‌సింగ్‌ ఫోన్‌ చేసి లక్ష రూపాయ‌ల మొత్తాన్ని తన ఖాతా తీసుకోవడం లేదని, ఈసారి లక్షకు ఒక రూపాయి తక్కువతో పంపాలని కోరాడు.

ర‌క‌ర‌కాల మోసాల‌కు నిల‌యం ఆన్లైన్..! జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే నిలువు దోపిడీ గ్యారెంటీ..!

ర‌క‌ర‌కాల మోసాల‌కు నిల‌యం ఆన్లైన్..! జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే నిలువు దోపిడీ గ్యారెంటీ..!

దీనిపై సాయికృష్ణ గతంలో పంపిన లక్ష ప్రస్తావన తేగా వాహనం అప్పగించేటప్పుడు సంబంధిత మొత్తాన్ని ఇచ్చి తిరిగి ఇచ్చి వేస్తానని మంజిత్‌సింగ్‌ వివరించాడు. ఇది నమ్మిన సాయికృష్ణ మరోసారి విడతల వారీగా మరో 80 వేలు పంపాడు. రెండ్రోజుల క్రితం మంజిత్‌సింగ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా అతని ఫోన్‌ నెంబరు పనిచేయడం లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన సాయికృష్ణ మంగళవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ కొనుగోళ్లు అన్ని వేళ‌లా శ్రేయ‌స్క‌రం కాదు సుమీ..!!

English summary
Buying At Low Rates in online..! be careful.!!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X