మోడీతో ప్రారంభం, 2030 నాటికి ప్రపంచమంతా హిందూరాజ్యం: సింఘాల్
న్యూఢిల్లీ/ఏలూరు: 15 ఏళ్లలో ప్రపంచమంతా హిందూ రాజ్యంగా మారుతుందని విశ్వహిందూ పరిషత్ అగ్ర నాయకులు అశోక్ సింఘాల్ శనివారం నాడు అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిందన్నారు.
ఇది సామాన్యమైనది కాదన్నారు. 800 సంవత్సరాల బానిసత్వానికి ఇది ముగింపు అన్నారు. దేశంలో జరగబోయే మార్పులకు ఈ విజయం నాంది అన్నారు. 2020 నాటికి భారత దేశం హిందూ రాజ్యంగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.
2030 నాటికి యావత్ ప్రపంచం కూడా హిందూ సమ్రాజ్యంగా మారుతుందని సత్య సాయిబాబా గతంలోనే తనకు చెప్పారన్నారు. అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

ఆ విప్లవం ఇప్పుడే ప్రారంభమయిందన్నారు. తొగాడియా.. ఆరెస్సెస్ మాజీ సర్ సంఘచాలక్ కెఎస్ సుదర్శన్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది హిందూ సమాజ కల అని, అది త్వరలో నెరవేరుతుందని అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ భాయ్ తొగాడియా ఏపీలో అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన తొగాడియా .. నరసాపురంలో శనివారం నిర్వహించిన హిందూ సమ్మేళన సభలో పాల్గొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications