బిగ్ బాంబ్.. పులివెందులకు ఉప ఎన్నిక తప్పదా..?
ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.త్వరలోనే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుందని జోస్యం చెప్పారాయన. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.
ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే... ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ చెప్పుకొచ్చారు.ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమని ఆయన అన్నారు.

జగన్ అలా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వర్తిస్తుందని.. పులివెందులకు ఉపఎన్నిక వస్తుందంటూ రఘరామ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.జగన్ అసెంబ్లీకి రావాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాలను వెల్లడించాలని రఘురామ కోరారు.
అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలను లేవనెత్తటం ఎమ్మెల్యేగా జగన్ బాధ్యతని ఆయన చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా స్పీకర్, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇచ్చేదా కాదని, ప్రజలు ఇవ్వాలని, వారు ఇవ్వనప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications