Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆయన గడ్డం అమరావతికి వరకు పెరిగినా..! సీమకు నీళ్లొచ్చేలా లేవు : బైరెడ్డి

కడప : ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం టీడీపీని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కడిగిపారేస్తున్నాయి . ఓవైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంటే, రాయలసీమ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఏడాది క్రితం, గండికోట రిజర్వాయర్ కు నీళ్లు తీసుకొచ్చే వరకు గడ్డం తీయబోనని ప్రతిజ్ఞ చేసిన డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. సతీష్ రెడ్డి గడ్డం రాజధాని అమరావతి వరకు పెరిగినా కడప పంట కాల్వలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ చైతన్య యాత్రలో భాగంగా కడప జిల్లాలో జమ్మలమడుగులో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

byreddy funny comments

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ముఖ్యమంత్రుల దోపిడీకి, కోస్తా నేతల చేస్తోన్న మోసాలకు ఏళ్లుగా రాయలసీమ ప్రాంతం మూల్యం చెల్లించుకుంటూనే ఉందన్నారు. ముఖ్యమంత్రులు తమ ప్రాంతం వారే అయినా.. ఒక్కరు రాయలసీమకు న్యాయం చేసినవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సీమకు జరుగుతున్న మోసాలపై ఇప్పటికైనా ప్రజలంతా ఒక్క తాటిపైకి రావాలని, ఇందుకోసం మేథావులు విద్యావంతులు క్రుషి చేయాలని పిలుపునిచ్చారు.

సీమకు జరిగిన అన్యాయాల గురించి ప్రస్తావిస్తూ.. అనంతపురం లేదా కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ ను మంగళగిరికి తరలించుకుపోవడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు పదే పదే రాయలసీమ కాలువ గట్ల మీద నిద్రపోతానని చెప్పడం కాకుండా.. ముందు శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాయలసీమ విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు ఇద్దరేనని, ఇప్పటికైనా డ్రామాలు ఆపి రాయలసీమ ప్రయోజనాల కోసం క్రుషి చేయాలన్నారు. కాగా, శ్రీశైలం కనీస నీటి మట్టానికి సంబంధించిన జీవో-69 లో చివరి ప్రాధాన్యతగా రాయలసీమ తాగునీటి అవసరాలను గుర్తించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గత నెల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులుగా పేర్కొంది. జీవోలో పేర్కొన్న అంశాల ప్రకారం నీటిమట్టం 834 అడుగులకు చేరుకోగానే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని నాగార్జునసాగర్ కి తరలిస్తారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందకుండా పోయే ప్రమాదముంది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ జీవోను పునరుద్దరించకపోతే సతీష్ రెడ్డి గడ్డం పెంచుకునే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+