బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విషయంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం, మహిళా విభాగం నూతన కమిటీలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నియమించారు. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్‌గాంధీ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నియమితులయ్యారు. మొత్తం 64 మందితో నూతన కమిటీ ఏర్పడింది. అలాగే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణి.. ఇద్దరినీ అధ్యక్షులుగా నియమించారు. ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళ నియామకమయ్యారు. ఇందులో కూడా 64 మందితో కార్యవర్గం ఏర్పాటైంది.

యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల), ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు), తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధికారిక ప్రతినిధులుగా తుమ్మా బాబుల్ రెడ్డి (పల్నాడు), జీవీ ప్రసాద్ (నెల్లూరు), కల్లం హరికృష్ణారెడ్డి (గుంటూరు)ని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా ఛెట్టి వినయ్ (అల్లూరి సీతారామరాజు), ముండ్ల అక్షయ్ రెడ్డి (కడప), భవనం వంశీ రెడ్డి( గుంటూరు), కందుల దినేష్ రెడ్డి (ఏలూరు), మల్లెల పవన్ కుమార్ (బాపట్ల) ఎంపికయ్యారు.

byreddy siddharth reddy as ysrcp youth wing new president

జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్ (విజయనగరం), జోన్-2, ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్ (విశాఖపట్నం), జోన్-3, జక్కంపూడి గణేష్ (తూర్పు గోదావరి), జోన్-4 పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు (కృష్ణా), జోన్- 5 మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, జోన్- 6, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (తిరుపతి), జోన్- 7 ఎం మధుసూధన్ రెడ్డి (కర్నూలు), జోన్-8 ఎల్లారెడ్డి ప్రణయ్ కుమార్ రెడ్డి (అనంతపురం) నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+