మున్సిపల్ ఎన్నికలపై బైరెడ్డి దృష్టి
అనంతపురం: రాయలసీమ రాష్ట్ర సాధన లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి గెలుపుకు కృషి చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో జరగబోయే మున్సిపాల్ ఎన్నికలకు ఆర్పీఎస్ సిద్దంగా వుందని బైరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలల్లో అన్ని స్థానాలల్లో పోటి చేస్తామని, రాయలసీమ వాదం బలపడే విధంగా ఈ ఎన్నికలల్లో పోటి చేస్తున్న ఆయన తెలిపారు. ఎన్నికలల్లో పోటికి చేసేందుకు 50శాతం నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తుందని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాయలసీమకు రావాల్సిన అభివ్రుద్ది సాధించే విధంగా పోరాటం చేస్తామన్నారు. అధికార పార్టీ, విపక్ష పార్టీలు రాయలసీమ అభివ్రుద్దిపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలలో ఎక్కడి సమస్యలు అక్కడే వున్నాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications