• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రజలు ఎవరి వైపు- ఏ పార్టీకి ఎన్ని సీట్లు : సీ ఓటర్‌– ఇండియా టుడే సర్వే తేల్చిందిదే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో 2024 ఎన్నికల కోసం ఇప్పటికే సమరం మొదలైంది. అధికారంలో ఉన్న జగన్ ను ఓడించేందుకుప ప్రతిపక్షాలు ఏకం కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొత్తుల పైన అనధికారిక చర్చలు మొదలయ్యాయి. ఇక, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీంతో...2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ఒక్క సారి అధికారానికే పరిమితం అవుతారంటూ జోస్యం చెబుతున్నారు. తాజాగా, ఉద్యోగుల్లో మొదలైన నిరసనలు సైతం వైసీపీకి రాజకీయంగా నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది.

సీ ఓటర్ - ఇండియా టూడే సర్వే

సీ ఓటర్ - ఇండియా టూడే సర్వే

ఇక, ఇప్పుడు దేశంలో 2024 ముందు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అయిదు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో..అదే విధంగా ఏపీలో పార్టీల పైన ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త సర్వే నిర్వహించింది.

అందులో పలు ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది.

సీఎం జగన్ ప్రజాదరణ పైన ఆసక్తి కరంగా

సీఎం జగన్ ప్రజాదరణ పైన ఆసక్తి కరంగా

ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. ప్రధాన మోదీకి జాతీయ స్థాయిలో ఆదరణ తగ్గకపోయినా.. రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు.

ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేదని నిర్ధారించింది. ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని సర్వే తేల్చింది. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లుగా పేర్కొంది. ఇక, ఇదే సర్వేలో ఏపీలో లోక్ సభ స్థానాల పైన తమ నివేదికను వెల్లడించింది. వైసీపీ అధినేత..ఏపీ సీఎం జగన్ కు ప్రజాదరణ తగ్గలేదని తేల్చింది.

ఆ రెండు పార్టీలకు ఛాన్స్ లేదంటూ

ఆ రెండు పార్టీలకు ఛాన్స్ లేదంటూ

రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ - బీజేపీ స్థానాలకు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ కు ఆరో స్థానం దక్కింది. యోగీ.. కేజ్రీవాల్.. మమతా.. స్టాలిన్.. ఉద్దవ్ థాక్రే తరువాత స్థానంలో జగన్ ఉన్నారు. అయితే, సొంత రాష్ట్రాల్లో 43 శాతం కంటే ఎక్కువగా మద్దతు లభించిన ముఖ్యమంత్రుల రేటింగ్స్ ను ఈ సర్వే వెల్లడించింది. అందులో ఏపీ సీఎం జగన్ ప్రస్తావన చేయలేదు. జాతీయ స్థాయిలో జగన్ మద్దతు లభించినా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం సర్వేలో 43 శాతం కంటే తక్కువగా మద్దతు రావటం పైన వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ,అసలు ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించలేదు.

జగన్ - చంద్రబాబు మధ్యనే పోటీ

జగన్ - చంద్రబాబు మధ్యనే పోటీ


బీజేపీ - కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పటం ద్వారా మరోసారి ఈ ఎన్నికల్లో నూ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యే ప్రధాన పాటీ నెలకొననుంది సర్వే తేల్చింది. సర్వే పైన సీనియర్ పొలిటికల్ అనలిస్టులు మాత్రం జనాదరణలో ఏపీకి జగన్ కు తిరుగులేదంటూ విశ్లేషణలు చేసారు. ఇక, ఏపీలో త్వరలో నర్సాపురం బైపోల్ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న సమయంలో ఈ సర్వేల కంటే... నేరుగా పబ్లిక్ పల్స్ వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా సాగే ఈ ఎన్నికలో తేలి పోయే అవకాశం ఉందంటూ చర్చ మొదలైంది. ఇక, ఇప్పుడు ఈ సర్వే ఫలితాల పైన ఎవరి విశ్లేషణలు వారు కొనసాగిస్తున్నారు.

English summary
C Voter - INdia to day survery reveals political mood of the AP people on seem to be mixed results for YSRCP and Opposition parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X