Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎంత - కేటీఆర్ సీఎం కాకుంటే భారీ నష్టం : సీ ఓటర్ సర్వే సంచలనం..!!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తవుతోంది. ప్రజా సంక్షేమ పధకాలతో వైసీపీ తమకు తిరుగులేదని భావిస్తోంది. వరుస ఎన్నికల్లో సాధించిన విజయాలతో ధీమాగా కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఐఎన్ఎస్ సీ ఓటర్ పరిపాలన సూచీ పేరిట నిర్వహించిన సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన సర్వేలో భాగంగా ఏపీలోని ఎమ్మెల్యేల తీరు పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలో తేల్చారు.

ఏపీ ఎమ్మెల్యేలపైన ప్రజాగ్రహం

ఏపీ ఎమ్మెల్యేలపైన ప్రజాగ్రహం

దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులుగా పేర్కొన్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ..టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జనసేన నుంచి ఒక్కరు గెలుపొందారు. అయితే, టీడీపీ నుంచి నలుగురు..జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీతో జత చేరారు. ఈ సర్వేలో పార్టీ పరంగా విశ్లేషణలు చేయకున్నా..ఇది సహజంగా అధికార పార్టీకి చెందిన వారి పైన ఉండే వ్యతిరేకతగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపైన ఏర్పడే యాంటీ ఇంకబెన్సీలో ఇది భాగంగా విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్ పైన ప్రజలు ఆగ్రహంతో

కేసీఆర్ పైన ప్రజలు ఆగ్రహంతో

ఏపీ తర్వాత ఎమ్మెల్యేలపై ప్రజలు అత్యధిక ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా రెండోస్థానంలో (24.3 శాతం) ఉంది. ఇక... ఎమ్మెల్యేలు 23.5 శాతం వ్యతిరేకత..ఆగ్రహంతో మూడో స్థానంలో నిలిచారు. ఇదే సర్వే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద నిర్వహించింది. అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి స్థానంలో ఉన్నట్లుగా సర్వేలో పేర్కొన్నారు. ఆయన 30.30శాతం మంది ఆగ్రహంతో ఉన్నట్లుగా తేల్చారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 28.1 శాతం వ్యతిరేకతతో రెండో స్థానంలో ఉన్నారు.

కేటీఆర్ ను సీఎం చేయకుంటే..బీజేపీ ఇలా

కేటీఆర్ ను సీఎం చేయకుంటే..బీజేపీ ఇలా

అయితే, తెలంగాణ రాజకీయాల పైన సీ ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ కీలక విశ్లేషణ చేసారు. తెలంగాణలో సర్వేలో పాల్గొన్న వారిలో సీఎం కేసీఆర్ పైన 30.3 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేసారని చెప్పుకొచ్చారు. వారు మార్పు కోరుకుంటున్నారని వివరించారు. కేసీఆర్ పైన వ్యతిరేకత తో పాటుగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రంలో మంచి రేటింగ్ ఉందని...బీజేపీకి తెలంగాణ మార్గం ఉందని విశ్లేషించారు. ఇదే సమయంలో కీలక సూచన చేసారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయటానికి ఇదే సరైన సమయమని.. లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు.

Recommended Video

    కేంద్రంతో ఏపి సీఎం కు రహస్య ఒప్పందాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేసిన వీహెచ్ || Oneindia Telugu
    సర్వేలో తేలిన ఫలితాలు ..అంచనాలు

    సర్వేలో తేలిన ఫలితాలు ..అంచనాలు

    ముఖ్యమంత్రులు సీఈవో తరహాలో పని చేస్తేనే ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇదే సర్వేలో మూడో స్థానంలో ఉన్న గోవా ముఖ్యమంత్రిపై 27.7 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. మరోవైపు... ఎమ్మెల్యేలపై అతి తక్కువ ప్రజాగ్రహం ఉన్న రాష్ట్రాల్లో కేరళ, గుజరాత్‌, మహారాష్ట్రలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

    కేరళలో ఎమ్మెల్యేలపై కేవలం 6.8శాతం, గుజరాత్ లో 7.4శాతం, మహారాష్ట్రలో 7.9శాతం మాత్రమే ఆగ్రహం కనిపించింది. చత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భగెల్ పైన ఆరు శాతం మంది మాత్రమే వ్యతిరేకతతో ఉన్నట్లుగా తేల్చారు.

    ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ పైన 10.10 శాతం.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పైన 10.4 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో అంచనాకు వచ్చారు. ఇక, ఈ సర్వే ఫలితాల పైన ఏపీలో అధికార వైసీపీ..తెలంగాణ లో టీఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+