ఏపీలో కొత్త జిల్లాలు, మండలాల పై కీలక ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పైన కసరత్తు చేస్తోంది. జిల్లాలు.. మండలాల ఏర్పాటుతో పాటుగా పేర్ల మార్పు అంశం పైన చర్చ జరుగుతోంది. ఇందు కోసం అభిప్రాయ సేకరణ.. నివేదిక కోసం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం పని మొదలు పెట్టింది. పలువురి నుంచి సూచనలు స్వీకరించింది. కొన్ని జిల్లాల పేర్లు పైన వినతులు వచ్చాయి. కాగా.. జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు.
కీలక నిర్ణయం
జిల్లాల పునర్విభజన పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పుల చేర్పులపై చర్చ చేసింది. ఏడుగురు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల సరిహద్దులు,పేర్లు పై ప్రజల వినతుల స్వీకరించాలని నిర్ణయించారు. అదే సమయంలో ప్రజానిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలనూ పరిగణన లోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. పరిపాలన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

కొత్తగా ఆరు జిల్లాలు
ఇక, రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. గత వైసిపి పాలనలో కొన్ని జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాల విలీనంతోపాటు భౌగోళిక అంశాల ఎంపిక ప్రక్రియ లోప యిష్టంగా జరిగిందని కూటమి ప్రభుత్వం పలు సందర్భాల్లో విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే లోపాలను సరిచేస్తామని సిఎం చంద్రబాబు ఎన్నికల పర్యటనల్లో హామీనిచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోపాలను సరిచేసి, సూచనలతో కూడిన నివేదికను నెలలోగా ఇవ్వాలని సిఎం ఆదేశించారు.
సంక్రాంతి వేళ
దీంతో, ఈ రోజు జరిగిన సమావేశంలో జిల్లా , రెవెన్యూ డివిజన్ , మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకున మార్పులు చేర్పులపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఏపీ విభజన వేళ 13 జిల్లాల గా ఉన్న సమయంలో 26 జిల్లాలు గా మార్చిన సమయంలో కొందరి అభ్యంతరాలు పట్టించుకోలేదని ఫిర్యాదులు అందాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాలు. ఒత్తిడి వల్ల ప్రజలకు అనుకూలంగా జరగలేదని మంత్రి అనగాని చెప్పుకొచ్చారు. మండలాల నుంచి సరైన ఏక్సెస్ ఆదాయ మార్గాలపై నిర్ణయం తీసుకునే విధంగా జరిగిందని చెప్పారు. ఈ నెల 29 30 తేదీల్లో వివిధ జిల్లాల్లో జీవోఎం పర్యటన చేస్తుందని ప్రకటించారు. వచ్చే జనవరి తర్వాత సరి హద్దులు..జిల్లా మార్పులు... ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబర్ 2 వరకు వినతులు ఇవ్వచ్చని మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లాలో మంత్రి వర్గ ఉప సంఘం పర్యటిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications