హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి బంద్: రోడ్లు, బస్టాండ్లు ఖాళీ, నేతల అరెస్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బందులో తెరాస, బిజెపి, సిపిఐలతో పాటు పలు తెలంగాణ ఉద్యమ సంఘాలు పాల్గొన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన ముంగించుకొని వస్తుండగా ఎన్టీ రంగా వర్సిటీ వద్ద కోడిగుడ్లు, టమాటాలను విసిరారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని మహబూబ్ నగర్ జిల్లాలో అడ్డుకున్నారు.

పలుచోట్ల ఆందోళనలో పాల్గొన్న బిజెపి, తెరాస, సిపిఐ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ఓయులో ర్యాలీని అడ్డుకోవడంతో విద్యార్థులు రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు రెండుసార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. తోపులాట జరిగింది. ఉస్మానియాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఇక తెలంగాణలోని పది జిల్లాల్లో ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రం యాదరిగిరి గుట్టపై బంద్ ప్రభావం కనిపించింది. ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. బందు ప్రభావం ప్రయాణీకులపై పడింది. ప్రయాణీకులు ఆటోలు, కార్లను ఆశ్రయించారు. హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ బోసిపోయింది.

సిపిఐ 1

సిపిఐ 1

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో కేంద్రం దిష్టిబొమ్మను హిమయత్‌నగర్‌లో ఊరేగిస్తున్న దృశ్యం.

సిపిఐ 2

సిపిఐ 2

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో కేంద్రం దిష్టిబొమ్మను హిమయత్‌నగర్‌లో ఊరేగించి దగ్ధం చేస్తున్న దృశ్యం.

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 1

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 1

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి బంద్‌కు పిలుపునివ్వడంతో బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్.

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 2

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 2

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి బంద్‌కు పిలుపునివ్వడంతో బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్. బస్సులు నిల్.

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 3

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 3

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి బంద్‌కు పిలుపునివ్వడంతో బోసిపోయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో నిలిచిపోయిన బస్సులు

తెరాస 1

తెరాస 1

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం.

తెరాస 2

తెరాస 2

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం. వి వాంట్ రియల్ తెలంగాణ నాట్ రాయల తెలంగాణ అంటూ ప్రదర్శిస్తున్న ప్లకార్డు.

నారాయణగూడ

నారాయణగూడ

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి బంద్‌కు పిలుపునివ్వడంతో బోసిపోయిన నారాయణగూడ ప్రాంతం దృశ్యం.

ప్యారడైజ్

ప్యారడైజ్

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా బందు కొనసాగిన నేపథ్యంలో హైదరాబాదులోని ప్యారడైజ్ ప్రాంతం నిర్మానుష్యంగా మారిన దృశ్యం.

బిజెపి 1

బిజెపి 1

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. సోనియా డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

బిజెపి 2

బిజెపి 2

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

బిజెపి 3

బిజెపి 3

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. మహిళా నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

తెరాస 1

తెరాస 1

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

తెరాస 2

తెరాస 2

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. నాయిని నర్సింహా రెడ్డిని అరెస్టు చేస్తున్న దృశ్యం.

సిపిఐ

సిపిఐ

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

తెరాస

తెరాస

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కార్యకర్తల నిరసన.

సిపిఐ

సిపిఐ

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

గాంధీ ఆసుపత్రి

గాంధీ ఆసుపత్రి

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ హైదరాబాదులోని మహాత్మా గాంధీ ఆసుపత్రి వద్ద తెలంగాణవాదులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం.

English summary
The Cabinet is expected to discuss the draft T bill today in light of the report from GoM, even as the TRS has called for a day long shoutdown in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X