ఏపీ - తెలంగాణ మధ్య తీగల వంతెన: లండన్ సస్పెన్స్ బ్రిడ్జి మోడల్: కేంద్రం ఆమోదం..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వంతెన రాబోతోంది. ఆధునిక సాంకేతికతతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రంగం సిద్దం అవుతోంది. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలోని కల్వకుర్తి (కొట్ర) నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ దూరాన్ని రహదారిగా నిర్ణయించారు. అందులో భాగంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మాణం దిశగా నిర్ణయం జరిగింది. దీని ద్వారా పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో ఆకర్షణీయమైన బ్రిడ్జి సిద్దం కాబోతోంది.

కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి

కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి

కృష్ణానది బ్యాక్‌వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జి నిర్మాణం కానుంది. కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్‌ సంస్థ మూడు ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిని జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో మూడో ఆప్షన్‌కు ఆమోదం లభించింది.

మొదటి ఆప్షన్‌ సోమశిల కాటేజీల నుంచి 1,800 మీటర్ల బ్రిడ్జికి, రెండో ఆప్షన్‌ సోమశిల వెళ్లే రహదారిలో కుడివైపు కృష్ణానది బ్యాక్‌వాటర్‌ నుంచి రోడ్డు, 750 మీటర్ల బ్రిడ్జికి ప్రతిపాదించారు. మూడో ఆప్షన్‌లో ప్రతిపాదించిన సోమశిల రీ అలాన్‌మెంట్‌ 9.20 కి.మీ రహదారి 600 మీటర్ల ఐకానిక్‌ బ్రిడ్జి ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది.

పిల్లర్లు కాకుండా లండన్‌ బ్రిడ్జి మాదిరిగా

పిల్లర్లు కాకుండా లండన్‌ బ్రిడ్జి మాదిరిగా

కాగా, కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద 173.73 కి.మీ., జాతీయ రహదారిలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో 87.600 కి.మీ., రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు రూ.1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతోపాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.

సోమశిల- సిద్దేశ్వరం రెండు కొండల మధ్య (600 మీటర్లు) తక్కువ దూరం ఉండటంతో ఈ స్థలాలన్ని బ్రిడ్జి నిర్మాణానికి ఎంపిక చేసారు. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్‌ బ్రిడ్జి మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మించాలని నిర్ణయించారు.

కేబుల్స్‌ బిగించి బ్రిడ్జి ఏర్పాటు

కేబుల్స్‌ బిగించి బ్రిడ్జి ఏర్పాటు

ఈ రెండు టవర్లకు కేబుల్స్‌ బిగించి బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్‌ నుంచి బ్రిడ్జి సప్‌సెంట్‌ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో.. సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం కొల్లాపూర్‌ ఎక్స్‌రోడ్డులో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు రూ.93 కోట్లు కేటాయించారు. కానీ, పనులు మొదలు కాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.193కోట్లు, రోడ్డుకు రూ.60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తిచేశారు.

త్వరలో అధికారిక ప్రకటన

త్వరలో అధికారిక ప్రకటన

బ్రిడ్జి నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. ఐకానిక్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్‌ ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తుండటంతో ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా మరింత ఆకర్షణీయ ప్రాంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన మ్యాప్ .. నిర్మాణం పైన కేంద్ర ఉపరితల శాఖ త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలతో ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+