కాల్ మనీ సెక్స్ రాకెట్: బౌన్సర్ భవానీ శంకర్ అరెస్టు, బుద్ధా వెంకన్న సోదరుడికి బెయిల్
విజయవాడ: కాల్ మనీ, సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో రెండో నిందితుడు భవానీ శంకర్‌ను శుకర్వారం కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. బౌన్సర్ భవానీ శంకర్‌ను ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇంచార్జీ జడ్జి డి. సత్యప్రభాకరంబాబు మందు హాజరు పరిచారు.
భవానీ శంకర్‌కు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్‌కు ఆదేశించారు. మాచవరం పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రామును, ఏడో నిందితుడు దూడల రాజేష్‌లను అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

కాల్ మనీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర రావుకు వన్ టౌన్ పోలీసులు గురువారంనాడు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వన్ టౌన్ పోలీసులు బుద్ధా నాగేశ్వర రావు కేసును చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు.
దానిపై స్పందించిన న్యాయమూర్తి ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చునని, కోర్టులో ఎందుకు పెడుతున్నారని అంటూ కేసును రిటర్న్ చేశారు. దాంతో వన్ టౌన్ పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదించి, నాగేశ్వర రావుకు స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications