కాల్ మనీ దందా: కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలిపై కార్పోరేటర్ వీరంగం
విజయవాడ: విజయవాడను కాల్ మనీ దందా కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో మరో సంఘటన చోటు చేసుకుంది. అధిక వడ్డీలు చెల్లించినా అవి తీర్చలేదని తన స్థలం కాగితాలు తీసుకని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాడంటూ ఓ మహిళ మాజీ రౌడీ షీటర్ మారంశెట్టి శివకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే, శివకుమార్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ 22వ డివిజన్ కార్పోరేటర్ పల్లెం రవికుమార్ కృష్ణలంక పోలీసు స్టేషన్ ఆవరణలో ఆ మహిళపై వీరంగం వేశాడు. రాణిగారితోటకు చెదిన ముక్తి కుమారి (46) సోమవారం రాత్రి మాజీ రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేశారు.

శివను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి కుమారి, ఆమె కూతురు జి. సుధ స్టేషన్‌కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పల్లెం రవికుమార్ శివపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని కుమారిని అడిగాడు.
ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కుమారి చెప్పడంతో మీరెవరంటూ ఆమె కూతురు సుధ మధ్యలో ప్రశ్నించింది. దీంతో రవి కుమార్ ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నోర్మూయ్ అంటూ అరిచాడు. దీంతో తల్లీకూతుళ్లు ఎవరో వచ్చి కేసు వాపసు తీసుకోవాలంటూ అడుగుతుంటే మీరు పట్టించుకోరేమిటని పోలీసులను అడిగారు. దీంతో అక్కడి నుంచి రవి కుమార్ వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications