కాల్ మనీపై బాబు: కెమెరాలకు అడ్డుపడ్డ వైసిపి ఎమ్మెల్యేలు, రెండ్రోజులు సస్పెండ్
హైదరాబాద్: కాల్ మనీ పైన చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఎవరు తప్పు చేసినా శిక్షించేది లేదని, సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరు బాగా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చెప్పారు. శాసన సభ మూడోసారి తిరిగి ప్రారంభమైన తర్వాత చంద్రబాబు మాట్లాడారు.
విపక్షాలు హుందాగా ప్రవర్తించాలన్నారు. వైసిపి నేతల ప్రవర్తన నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. సభ సజావుగా నడిస్తే అంబేడ్కర్ పైన చర్చను ప్రారంభిద్దామన్నారు. కాల్ మనీ వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీ వారు అయినా శిక్షిస్తామని చెప్పారు.
బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతకు చర్చ విషయంలో ఏమైనా సమాచారం లేదేమోనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... సమాచారం విషయంలో ఎలాంటి గ్యాప్ లేదని జగన్ తీరును బట్టి అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లేచి అంబేడ్కర్ పేరు ప్రస్తావించగానే.. జగన్ తమ సభ్యులతో లేవండి లేవండి (ఆందోళన కోసం) సూచించారని, దీనిని బట్టే అంబేడ్కర్ పట్ల ఆయనకు ఉన్న గౌరవం అర్థమవుతోందన్నారు. సభలో అంబేడ్కర్ పేరు ప్రస్తావించేందుకు కూడా జగన్ అంగీకరించడం లేదన్నారు.
సభలో ప్రతిపక్షం బల్లలను కొడుతూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై యనమల మాట్లాడుతూ.. సభలో బల్లలు బద్దలు కొట్టినా, ఇతర నష్టం కలిగించినా అందుకు నష్టపరిహారం వసూలు చేసే అధికారం ఉందని చెప్పారు.
సభ నుంచి ఇద్దరు సభ్యుల సస్పెన్షన్
ఇద్దరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కెమెరాలను అడ్డుకోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. శివప్రసాద్ రెడ్డి, రామలింగేశ్వర రావులను రెండు రోజుల పాటు సభాపతి కోడెల శివప్రసాద రావు సస్పెండ్ చేశారు. వారు కెమెరాలకు అడ్డుపడ్డారని యనమల చెప్పారు. వారిపై ఒకరోజు సస్పెన్షన్‌కు యనమల ప్రతిపాదిస్తే స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
అపరిచితుడిలా: జగన్‌పై గొల్లపల్లి
జగన్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. సభలో గందరగోళం చెలరేగటంతో మూడోసారి సభను వాయిదా వేశారు. సభను రేపటికి వాయిదా వేశారు.
శాసనసభా ప్రాంగణంలో జూపూడి
కాల్ మనీ వ్యవహారంలో అన్ని రాజకీయ పార్టీల బండారం బయటపడుతుందని జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఇందులో ఏ ఒక్క పార్టీకి చెందిన వారో మాత్రమే లేరని చెప్పారు. కాల్ మనీ పైన రేపు చర్చిద్దామని ప్రభుత్వం చెప్పాక కూడా వైసిపి ఎందుకు రాద్దాంతం చేస్తోందన్నారు.
అంబేడ్కర్ పైన చర్చను అడ్డుకోవడం ద్వారా వైసిపి ఆయనను, దళితులను అవమానిస్తోందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ పైన గౌరవం ఉంటే వైసిపి వెంటనే చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications