కాల్ మనీ గుట్టు తేలుతుంది!: బాబుని లాగేందుకు జగన్, కార్నర్ కోసం టిడిపి
విజయవాడ: కాల్ మనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. అసెంబ్లీలో కూడా ఈ అంశం హాట్ హాట్‌గా మారింది. కాల్ మనీ అంశంపై అధికార, ప్రతిపక్షాలు ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
కాల్ మనీ నిందితుల్లో ఎక్కువ మంది టిడిపి వారే ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే, అసలు పెద్ద దొంగలు జగన్ పార్టీ వారేనని, వారి పార్టీ వారే ఎక్కువ మంది ఉన్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఎదురు దాడికి దిగుతోంది.
కాల్ మనీ వ్యవహారంపై చర్చించే వరకు తగ్గే ప్రసక్తి లేదని శాసన సభలో వైసిపి అడ్డుకుంది. దీంతో గురువారం నాడు సభ మూడుసార్లు వాయిదా పడింది. వైసిపి సభ్యులు అందరూ కొత్త వారని, అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాల్ మనీ బురద తమకు అంటకుండా ఇటు టిడిపి, అటు వైసిపి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవిధంగా వైసిపి మరింత దూరం పాటించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కాల్ మనీలో అన్ని పార్టీల వారు ఉన్నారని టిడిపి చెబుతోంది. అయితే వైసిపీ మాత్రం తమ పార్టీ నేతలను తప్పించేందుకే అధికార పార్టీ విపక్షాల పైకి రుద్దుతోందని ఆరోపిస్తోంది. కాల్ మనీ వ్యవహారంలో తమ పార్టీకి చెందినవారు లేరన్నట్లుగా ఆ పార్టీ వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు.

అసెంబ్లీని పదేపదే అడ్డుకోవడంపై మంత్రి యనమల రామకృష్ణుడు శాసన సభలో మాట్లాడుతూ.. కాల్ మనీ వ్యవహారం పై రేపు చర్చిస్తామని, ఇందులో ఎవరెవరు ఉన్నారో అన్నీ తేలుతాయని నొక్కి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు వైసిపిని ఉద్దేశించి అన్నట్లుగా కనిపిస్తున్నాయని భావిస్తున్నారు.
కాల్ మనీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. ఆయనను కాల్ మనీ వ్యవహారంలోకి లాగేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పదేపదే చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారని చెబుతున్నారు.
కాల్ మనీ నిందితుల పైన ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఈ వ్యవహారంలో ఉన్నప్పటికీ కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక, అధికార తెలుగుదేశం పార్టీ కూడా వైసిపిని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.
కాల్ మనీ నిందితుడితో చంద్రబాబు ఉన్న ఫోటోను వైసిపి బయటకు తీస్తే, అందుకు ప్రతిగా టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ.. మరో కాల్ మనీ నిందితుడు రాజేష్‌తో జగన్ ఉన్న ఫోటోను మీడియాకు విడుదల చేశారు. కాల్ మనీ వ్యవహారంలో వైసిపి నేతలే ఎక్కువగా ఉన్నారని చెప్పేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications