ముగిసిన హోరు: కత్తులు దూసుకున్నారు (ఫొటోలు)

హైదరాబాద్: సీమాంధ్రలో ప్రచార హోరు సోమవారం సాయంత్రం ముగిసింది. తెలంగాణలో గత నెల 30వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు సీమాంధ్రలో తమ ప్రచారం సాగించారు. సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాలకు, 175 శాసనసభా స్థానాలకు పోలింగ్ జరగనుంది.

సీమాంధ్రలో నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఆరు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన తల్లి వైయస్ విజయమ్మ, ఆయన సోదరి వైయస్ షర్మిల సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం సాగించారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు కురిపించారు. సీమాంధ్రలో తెలుగుదేశం, బిజెపి తరఫున పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాల్లో పర్యటించారు. చంద్రబాబు కూడా విడి ప్రచారం సాగించారు.

కాంగ్రెసు తరఫున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ప్రచారం సాగించారు. రాహుల్ గాంధీ అనంతపురంలోని హిందూపురం బహిరంగ సభలో ప్రసంగించగా, సోనియా గాంధీ గుంటూరు సభలో ప్రసంగించారు. కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెసు తరఫున సీమాంధ్రలో పర్యటించారు. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగించారు.

ముగ్గురు కలిసి ప్రచారం..

ముగ్గురు కలిసి ప్రచారం..

తెలంగాణలో ప్రచారం ముగిసిన వెంటనే నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్ర బాబు నాయుడు మూడు సభల్లో ప్రచారం సాగించారు.

చంద్రబాబు నాయుడు విడిగా..

చంద్రబాబు నాయుడు విడిగా..

నరేంద్ర మోడీతో సభలు ముగిసిన తర్వాత, అంతకు ముందు కూడా విడిగా సీమాంధ్రలో ప్రచారం సాగించారు. వైయస్ జగన్‌ను ప్రధానంగా లక్ష్యం చేసుకని ఆయన విమర్శలు గుప్పించారు.

పవన్ కళ్యాణ్ విడిగా..

పవన్ కళ్యాణ్ విడిగా..

తెలుగుదేశం, బిజెపిల తరఫున పవన్ కళ్యాణ్ విడిగా ప్రచారం సాగించారు. ఆయన ‌జగన్‌నే కాకుండా తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌ను కూడా లక్ష్యం చేసుకుని పంచ్ డైలాగులు వదిలారు.

హిందూపురంలో రాహుల్ గాంధీ

హిందూపురంలో రాహుల్ గాంధీ

అనంతపురం జిల్లా హిందూపురం బహిరంగ సభలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కాంగ్రెసు పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.

గుంటూరులో సోనియా గాంధీ

గుంటూరులో సోనియా గాంధీ

గుంటూరు బహిరంగ సభలో సోనియా గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. విభజన బాధ కలిగించేదే అయినా తప్పలేదని ఆమె చెప్పారు.

వైయస్ జగన్ నిరంతరంగా...

వైయస్ జగన్ నిరంతరంగా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేస్తూ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రధానంగా చంద్రబాబును లక్ష్యం చేసుకుని విమర్శలు చేశారు.

వైయస్ విజయమ్మ కూడా...

వైయస్ విజయమ్మ కూడా...

విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైయస్ విజయమ్మ సీమాంధ్రలో తమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం కోసం ప్రచారం నిర్వహించారు.

వైయస్ షర్మిల పవన్ కళ్యాణ్‌పై...

వైయస్ షర్మిల పవన్ కళ్యాణ్‌పై...

పోటీకి దూరంగా ఉన్న జగన్ సోదరి వైయస్ షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల కోసం సీమాంధ్రలో ప్రచారం సాగించారు. ఆమె బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

బాలకృష్ణ హిందూపురం వెలుపల కూడా..

బాలకృష్ణ హిందూపురం వెలుపల కూడా..

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తన ప్రచారాన్ని కేంద్రీకరించినప్పటికీ బాలకృష్ణ తమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం కొన్ని జిల్లాల్లో ప్రచారం సాగించారు

చంద్రబాబు తనయుడు నారా లోకేష్...

చంద్రబాబు తనయుడు నారా లోకేష్...

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్ష పాత్ర నిర్వహించారు. ఆయన షర్మిల, జగన్‌లను దుయ్యబడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెసుకు చిరంజీవే దిక్కు...

కాంగ్రెసుకు చిరంజీవే దిక్కు...

సీమాంధ్ర ప్రధాన ప్రచార సారథి చిరంజీవి. కాంగ్రెసు బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. అయితే, ఆయన ఏ మేరకు విజయం సాధిస్తాడనేది చెప్పలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+