నా జీవితాన్ని సినిమాగా తీయొచ్చు: టి మంత్రి రాజయ్య
హైదరాబాద్: తన జీవితాన్ని చక్కని సినిమాగా తీయొచ్చని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అన్నారు. పశువుల కాపరి నుంచి పసి పిల్లల వైద్యుడిగా మారానని.. ఆ తర్వాత మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగానని తెలిపారు.
మంగళవారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గురుకుల పాఠశాలల విద్యార్థులు రూపొందించిన మూడు లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అల్లూరి శ్రీమతి అనే ఇంటర్మీడియట్ విద్యార్థి దర్శకత్వంలో రూపొందించిన ‘చైతన్యం', మరో విద్యార్థిని మౌనిక దర్శకత్వంలో ‘మేలుకో', విద్యార్థి గాలి మహేందర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎందుకిలా' అనే అనే లఘు చిత్రాలను కార్యక్రమంలో ప్రదర్శించారు.
కార్యక్రమంలో ఈ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలతోపాటు అవార్డులను అందించారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు రామ్‌లక్ష్మణ్, ఏపి సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాధ, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, మాజీ సిఎస్ మాధవరావు, జయలక్ష్మి, ప్రవీణ్ కుమార్ హాజరై బహుమతులు అందజేశారు.












Click it and Unblock the Notifications