Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పురందేశ్వరి వల్ల కానిది మాధవ్ సాధిస్తారా ? బీజేపీ నేతల లెక్కలేంటి ?

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు భారీ మెజార్టీతో విజయం సాధించాయి. రాష్ట్రంలో పార్టీల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తులో భాగంగా అత్యధిక సీట్లు తీసుకున్న టీడీపీ 90 శాతం పైగా విజయాల్ని నమోదు చేసుకుంది. అలాగే జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 సీట్లూ గెల్చుకుంది. ఇక బీజేపీ మాత్రం 8 సీట్లలో విజయం సాధించింది. తాజాగా కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది.

అయితే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీకి పదవుల విషయంలో మాత్రం మొండిచేయే ఎదురవుతోంది. కూటమిలో అన్ని పార్టీలు సమానమే అని చెప్తున్నా చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని సాకుగా చూపుతూ బీజేపీకి 5 శాతం పదవులతో సరిపెట్టేస్తున్నారనే అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్రంలో కొత్త బీజేపీ ఛీఫ్ గా పీవీఎన్ మాధవ్ ఎన్నిక తర్వాత నాయకులు నేరుగా ఆయన వద్దే ప్రస్తావించారు.

can pvn madhav do where purandeswari failed huge expectations in ap bjp leaders

గత ఎన్నికలకు ముందు నుంచే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కూటమి ప్రభుత్వంలో తన లాబీయింగ్ ఉపయోగించి పార్టీ నాయకులకు పదవులు ఇప్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె హయాంలో కేవలం కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీకి కేవలం 5 శాతం పదవులు మాత్రమే దక్కాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం ఆమె తన బావ అయిన చంద్రబాబు వద్ద అనుకున్న స్ధాయిలో లాబీయింగ్ చేయకుండా రాజీ పడ్డారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె స్ధానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాధవ్ పై నేతల్లో భారీ అంచనాలున్నాయి.

can pvn madhav do where purandeswari failed huge expectations in ap bjp leaders

అయితే పురందేశ్వరి వల్లే కానిది పీవీఎన్ మాధవ్ సాధిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి కారణం పురందేశ్వరితో పోలిస్తే సౌమ్యుడిగా పేరున్న మాధవ్ మాట విని బీజేపీ నేతలకు పదవుల విషయంలో చంద్రబాబు న్యాయం చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. దీంతో పురందేశ్వరి ఉన్నప్పుడు లభించిన స్దాయిలో అయినా పదవులు వస్తాయా లేదా అన్న మరో ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోంది. ఏదేమైనా మాధవ్ దూకుడుగా రాజకీయాలు చేయగలిగితేనే కూటమిలో అయినా, రాష్ట్రంలో అయినా పార్టీకి మనుగడ ఉంటుందనేది బీజేపీ నాయకుల మాట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+