వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు క్లాస్‌: ఎత్తుగ‌డ‌ల్లో జ‌గ‌న్ నిష్ణాతుడు : ఎన్నిక‌ల‌కు ఇలా వెళ్దాం..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు దిశా నిర్ధేశం చేసారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకె ళ్ల లేక‌పోతున్నారంటూ ఎమ్మెల్యేల‌కు క్లాస్ తీసుకున్నారు. చేసిన‌వి చెప్పుకోవాల్సిన బాధ్య‌త నేత‌ల‌దేన‌ని స్ప‌ష్టం చే సారు. ఇక‌, ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసి..నెల రోజుల పాటు పూర్తిగా ప్ర‌చారం లో ఉంటానంటూ ఎ న్నిక‌ల కార్యాచ‌ర‌ణ సీయం ప్ర‌క‌టించారు.

ఎత్తుగ‌డ‌ల్లో జ‌న‌గ్ నిష్ణాతుడు..

ఎత్తుగ‌డ‌ల్లో జ‌న‌గ్ నిష్ణాతుడు..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ ఎమ్మెల్యేల‌తో సమావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. వ చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ముందుకెళ్లాలో సూచించారు. ఎత్తుగ‌డ‌ల్లో జ‌గ‌న్ నిష్ణాతుడని వ్యాఖ్యానించిన సీయం.. ప్ర‌భుత్వ సాధించిన విజ‌యాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల లేక‌పోతున్నారంటు ఎమ్మెల్యేల‌కు క్లాస్ తీసుకున్నారు. మ‌నం కియో తెచ్చిన విష‌యాన్ని ఉత్త‌రాంధ్ర‌..రాయ‌ల‌సీమ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. రాజ‌శేఖ‌ర రెడ్డి ఒక్క ప‌రిశ్ర‌మ కూడా తేలేద‌ని.. ప్ర‌ధాని కియో తెచ్చారని బిజెపి నేత‌లు అబ‌ద్దాలు చెబుతున్నార‌న్నారు. ఎన్నిక‌ల ముందు మోదీ ఏం చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నాన‌ని చెప్పిన సీయం..11న ఢిల్లీలో దీక్ష‌కు అంద‌రూ రావాల‌ని ఆదేశించారు. ఇందు కోసం ప్ర‌త్యేకం గా రైలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌జా సంఘాలు..కుల సంఘాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండండి..

ప్ర‌జా సంఘాలు..కుల సంఘాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండండి..

ఏపికి జ‌రిగిన అన్యాయం పై ప్ర‌జా సంఘాలు పోరాడుతున్నాయ‌ని..వారితో మ‌మేకం కావాల‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టిన బంద్ కు పిలుపునిచ్చార‌ని..మ‌నం బంద్ కు వ్య‌తిరేక‌మ‌ని చెప్పుకొచ్చారు. కేంద్రం చేసిన ద్రోహానికి నిర‌స‌న‌గా స‌భ‌లో తీర్మానం చేద్దామ‌ని..అంద‌రూ న‌ల్ల‌చొక్కాలు ధ‌రించి స‌భ‌కు రావాల‌ని ఆదేశించారు. ఫిబ్ర‌వ‌రి 2,3,4 తేదీల్లో ఫించ‌న్ల పండుగ పేద‌ల పండుగగా జ‌ర‌పాల‌ని సూచించారు. ఆ మూడు రోజులు సంక్షేమ ఉత్స‌వాలు నిర్వ‌హిం చాల‌న్నారు. 9న 4ల‌క్ష‌ల సామూహిక గృహ ప్ర‌వేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మావేశాల్లోనే బిసి సబ్ ప్లాన్ కు చ‌ట్ట బ‌ద్ద‌త‌, కాపు రిజ‌ర్వేష‌న్లు వంటి బిల్లుల‌ను ఆమోదిస్తామ‌ని చెప్పారు.

ఎన్నిక‌ల‌కు ఇలా సిద్దం అవ్వాలి..

ఎన్నిక‌ల‌కు ఇలా సిద్దం అవ్వాలి..

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం లేద‌న్న చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌కు ప‌లు సూచ‌న‌లు చేసారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ ముగుస్తుంద‌న్నారు. త‌రువాత 30 రోజుల పాటు పూర్తిగా ప్ర‌చారం చేస్తాన‌ని..అభ్య‌ర్దు లు సైతం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకోవాల‌ని సూచించారు. తాను రోజుకు రెండు జిల్లాల్లో ప‌ర్య‌టించాలా..లేక స‌భ‌ల‌ను నిర్వ‌హించాలా..రోడ్ షోనా..బ‌స్ యాత్ర చేయాలా అనే దాని పై ఆలోచ‌న చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తీ ఎమ్మెల్యే అన్ని కుల సంఘాల‌తో మ‌మేకం కావాల‌ని.. ప్ర‌తీ కులానికి మ‌నం న్యాయం చేసామ‌ని విశ్లేషించారు. ఇక‌, రాష్ట్రం పై మోదీ తో క‌లిసి కెసిఆర్..జ‌గ‌న్ చేస్తున్న కుట్ర‌ల పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి దిశా నిర్ధేశం చేసారు.

English summary
CM Chandra Babu conducted TDLP meeting and Given suggestions and directions to Mla's. By end of February candidate selections will be completed after that Cm decided to campaign for 30 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X