28, 30 తేదీల్లో టీ అభ్యర్థులు: దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ: ఈ నెల 28, 30 తేదీల్లో తెలంగాణలోని శాసనసభ స్థానాలకు, లోకసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీ స్థిరంగానే ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

త్వరలో తెలంగాణ కాంగ్రెసు స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని దిగ్వజయ్ సింగ్ చెప్పారు. కాంగ్రెసు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేసమై అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేస్తుందని అన్నారు.

Candidates will be announced soon: Digvijay

గాంధీభవన్‌లో కాంగ్రెసు పా్రటీ తెలంగాణ ఎన్నికల ప్రణాళిక కమిటీ శుక్రవారం హైదరాబాదులో సమావేశమైంది. కమిటీ సభ్యులు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సమావేశమైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి. హనుమంతరావు, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభద్రతా భావంలో ఉందని మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. కుటుంబ పాలననా, సామాజిక న్యాయమా తేల్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు ఓటేయబోతున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+