రాజధాని, ధర: బంజారాహిల్స్‌ని మించిన బెంజ్ సర్కిల్!

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఉంటుందనే వార్తల నేపథ్యంలో బెజవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద భూమి ధరలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాస్ట్‌లీయెస్ట్ ప్రాంతంగా భావించే బంజారాహిల్స్‌ను మించిపోతున్నాయట.

విజయవాడ - గుంటూరు మధ్య ఎపి రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్గతంగా పార్టీ నేతలకు చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, రాజధాని అక్కడ బాగుంటుందని చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు బాహాటంగానే అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలకు రెక్కలు వస్తున్నాయి.

Capital: Benz Circle beats Banjara Hills!

హైదరాబాద్ నగరానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వాణిజ్యపరంగా ఎంతో ముఖ్యమైనది. ఎన్నో కార్పొరేట్ ఆఫీసులు, సెలబ్రిటీల నివాసాలు ఇక్కడ ఉంటాయి. ప్రముఖుల ఇళ్లు ఉంటాయి. ఇక్కడ సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు కొనలేని పరిస్థితి!

అయితే, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారాయి! విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రాంత రియల్ రేటు పెరిగిపోయింది. విజయవాడ నడిబొడ్డున గల బెంజి సర్కిల్‌లో చదరపు గజం ధర రూ.1.2 లక్షల పైనే పలుకుతోందట. అదే చదరపు గజం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రూ.80 వేలు మాత్రమే ఉందంటున్నారు.

తాజా స్థితిగతులను సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన రియల్టర్లు విజయవాడ, గుంటూరు మధ్యలో స్థలాలకు భారీగా ధరలను ఫిక్స్ చేశారట. మరోవైపు తెలంగాణలోని హైటెక్ సిటీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని రియాల్టర్లు భావిస్తున్నారు. దీంతో హైటెక్ సిటీ పరిసరాల్లో భూమి ధరలు పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+